రేపటి నుంచి జూన్ 1 వరకు ఈ రాశులవారికి మహారాజ యోగం

గ్రహాలు ఒక నిర్ధిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరోరాశికి సంచరిస్తుంటాయి. ఇలా సంచరించే క్రమంలో కొన్ని అనుకూల పరిణామాలు ఏర్పడితే మరికొన్ని ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయి. ఈనెల 24వ తేదీ నుంచి మీనరాశిలో రాహువును కుజుడు కలుస్తున్నాడు. దీనివల్ల కోర్టు వివాదాలు పరిష్కారమవుతాయి. కుజుడు-రాహువు యుతి జూన్ 1 వరకు కొనసాగుతుంది. వృషభం, మిథునం, తుల, థనుస్సు, మకరం, మీన రాశుల వారికి బాగా కలిసివస్తుంది.

వృషభం
వీరి జీవితంలో సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. ఆదాయం పెరుగుతుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం సాధిస్తారు. న్యాయపరమైన కేసులన్నీ అనుకూలంగా పరిష్కారమవుతాయి. కొద్ది ప్రయత్నంతో డబ్బు చేతికి అందివస్తుంది. ఉద్యోగ జీవితం బాగుంటుంది.

Mars is conjoining Rahu in Pisces The Mars-Rahu conjunction will continue till June 1

మిథునం
లాయర్లకు గుర్తింపు లభిస్తుంది. డాక్టర్లు తమ సేవద్వారా వెలుగులోకి వస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం ఉంది. నిరుద్యోగులు అంచనాలకు మించి ఆఫర్లు పొందుతారు.

తుల
ఉన్నతస్థాయికి చేరుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో పోటీ ఉంటుంది. ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మొండి పట్టుదలతో ప్రయత్నించి ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం ఉంది. ఆదాయం పెరగడంవల్ల ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.

ధనుస్సు
జీతభత్యాలను భారీగా సంపాదించుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. భూ సంబంధమైన ఒప్పందాలు సానుకూలంగా సాగుతాయి. ఆస్తి విలువ పెరుగుతుంది. రాదనుకున్న సొమ్ము చేతికి అందుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి.

మకరం
చిన్న ప్రయత్నంతోనే పనులు అవుతాయి. ఏ రంగానికి చెందినవారైనా వారి పురోగతి బాగుంటుంది. ప్రమోషన్లు ఉన్నాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. మనసులోని కోరికలు నెరవేరతాయి. నిరుద్యోగులు అనుకున్నది సాధిస్తారు. విదేశీ ప్రయాణాలున్నాయి. చిన్న ప్రయత్నం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది.

మీనం
అనారోగ్యాల నుంచి బయటపడతారు. ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వృత్తి, వ్యాపారంలో పోటీదారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. విదేశీ ప్రయాణానికి ఆటంకాలు తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. రావల్సిన డబ్బు చేతికి వస్తుంది. బాకీలన్నీ వసూలవుతాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+