కుజుడు సంచారం..ఈ రాశులు వారికి మహార్థశ పట్టబోతుంది
కుజుడు అనేది అంగారకుడు గ్రహానికి పెట్టబడిన పేరు. ఇది సౌర కుటుంబం సూర్యుని చుట్టూ పరిభ్రమించే 9 గ్రహాలలో నాలుగో స్థానంలో ఉంటుంది.సౌర వ్యవస్థలోని గ్రహాలలో నాలుగో స్థానంలో ఉండే అంగారకుడు, పురుష గ్రహం. దీని రంగు కారణంగా 'అరుణ గ్రహం' అని కూడా పిలుస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో కుజుడు ధైర్యం, సాహసం, చొరవకు ప్రతీక.కుజుడు భూ లాభం, స్థిరాస్తులకు కారకుడు. వేద జ్యోతిష్యంలో కుజుడికి ప్రత్యేక స్థానం ఉంది.
కుజుడి యొక్క స్థానాన్ని బట్టి మరియు అది ఇతర గ్రహాలతో ఎలా సంకర్షణ చెందుతుందో, జ్యోతిష్యులు వ్యక్తి యొక్క భవిష్యత్తును అంచనా వేస్తారు. జాతకంలో కుజుడు మంచి స్థానంలో ఉంటే ఆ రాశుల వారికి శుభాలు కలుగుతాయి.కుజుడు ఏప్రిల్ నెలలో రెండుసార్లు రాశి సంచారం చేయబోతున్నాడు.తద్వారా పలు రాశల వారికి శుభయోగకరంగా ఉండనుందని పండితులు చెబుతున్నారు.ఈ రాశులు ఏవో మనం కూడా ఓసారి పరిశీలిద్దాం.

తులా రాశి
కుజుడు అనుగ్రహం అనుగ్రహం తులా రాశి వారిపై ప్రభావం చూపించనుంది. ఈ రాశి వారికి ఏప్రిల్ నెలలో ఊహించని ఫలితాలు చవి చూస్తారు.విద్యార్థులకు చక్కటి అవకాశాలు అందుతాయి.వ్యాపారం చేసే వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది.అలాగే ఆస్తి తగాదాలు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
కర్కాటక రాశి
ఏప్రిల్ నెలలో రెండుసార్లు కుజుడు సంచారం యోగం కర్కాటక రాశి వారికి ఫలితాలను అందించనుంది. కర్కాటక రాశిలో జన్మించిన వారికి అద్భుతమైన లాభాలు కలుగుతాయి. మార్కెట్ రంగంలో వీరు రాణించే అవకాశం కనిపిస్తోంది. గతంలో కంటే ఇప్పుడు ఆర్థికం పరిస్థితులు మెరుగుపడతాయి. వ్యాపారం చేసే వారికి కొత్త ఆదాయ మార్గాలు దొరుకుతాయి. విద్యార్థులకు విదేశి యానం కనిపిస్తోంది.
వృషభ రాశి
కుజుడు రాశి సంచారం ప్రభావం వృషభ రాశిపై పుష్కలంగా ఉండనుంది. వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఘనమైన విజయాలు దక్కుతాయి. ఈ రాశి వారికి ఊహించని లాభాలు కలిగే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగులకు పదోన్నతి దక్కనుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ప్రేమ పెళ్లులకు అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications