కన్యారాశిలో కుజ సంచారం... వీరిదే సంపన్న యోగం.. మీరున్నారా?
సౌర కుటుంబంలో సూర్యుడు నుంచి నాలుగవ గ్రహంగా కుజుడుని చెబుతారు. జ్యోతిషశాస్త్రంలో ధైర్యానికి, శౌర్యానికి, పరాక్రమానికి ప్రతీకగా కుజ గ్రహాన్ని భావిస్తారు. కుజ గ్రహాన్ని అరుణగ్రహం అని అంగారక గ్రహం అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా కుజుడు స్థానం వ్యక్తి యొక్క జాతకంలో వివాహంపైన ప్రభావం చూపుతుందని చెబుతారు. కుజదోషం ఉన్నవారికి త్వరగా పెళ్లిళ్లు కావని, వారి వైవాహిక జీవితం పైన ప్రతికూల ప్రభావం పడుతుందని జ్యోతిష్య పండితులు చెబుతారు.
జులై మాసంలో కుజ సంచారం
అటువంటి కుజుడు జూలై మాసంలో తన రాశిని మార్చుకుంటున్నారు. జూలై మాసంలో కుజుడు సింహరాశి నుండి కన్య రాశిలోకి మారుతున్నాడు. జూలై 28వ తేదీన సోమవారం రోజు రాత్రి 8 గంటల 11 నిమిషాలకు కుజుడు కన్యారాశిలోకి సంచారం చేయబోతున్నాడు. కన్యా రాశిలో కుజ సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుంది. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మిధున రాశి
కన్యా రాశిలో కుజ సంచారం కారణంగా మిధున రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో మిధున రాశి జాతకులు ఏ పని చేసిన సానుకూల ఫలితాలను చూస్తారు. ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి సమయం. ఎప్పటినుంచో నిలిచిపోయిన బాకీలు వసూలవుతాయి. విద్యార్థులకు కూడా ఇది మంచి సమయం. ఈ సమయంలో మిధున రాశి వారికి జీవితం సంతోషంగా ఉంటుంది.
సింహరాశి
కన్యా రాశిలో కుజ సంచారం కారణంగా సింహరాశి జాతకులు సానుకూల ఫలితాలను పొందుతారు. సింహ రాశి వారి జీవితంలో ఈ సమయంలో సానుకూల మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగాలు చేసేవారు మీ పని తో సీనియర్లను ఆకట్టుకుంటారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఆర్థిక లాభాలు వస్తాయి. ఆకస్మిక ధన లాభం వచ్చే అవకాశం ఉంది. కన్యారాశి జాతకులు ఈ సమయంలో సమాజంలో గుర్తింపు ఉన్న వ్యక్తులను కలుస్తారు.
మకర రాశి
కన్యా రాశిలో కుజ సంచారం కారణంగా మకర రాశి జాతకులు అదృష్ట జాతకులు అవుతున్నారు. మకర రాశి వారికి ఈ సమయంలో ఉద్యోగానికి సంబంధించి విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఎంతోకాలంగా నిలిచిపోయిన డబ్బులు వసూలు అవుతాయి. నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఎప్పటి నుండో వసూలు కాని మొండి బాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగం చేసే చోట పదోన్నతి పొందే అవకాశం ఉంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications