రోహిణి నక్షత్రంలో కుజుడు వీరికి ఆకస్మిక ధనలాభాలు తెస్తున్నాడు!
గ్రహాలు ఒక ఒక రాశి నుండి మరొక రాశిలోకి సంచారం చేయడం వల్ల అన్ని రాశులవారి జీవితాలపైన ప్రభావం పడుతుంది. అంతేకాదు గ్రహాల నక్షత్ర సంచారం కూడా మన జాతకం మీద ప్రభావం చూపిస్తుంది. జూలై 27వ తేదీన కుజుడు కృత్తిక నక్షత్రం నుండి రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించాడు. రోహిణి నక్షత్రంలో అంగారక సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.
మేషరాశి
రోహిణి నక్షత్రంలో కుజ సంచారం కారణంగా మేష రాశి వారికి లబ్ధి జరుగుతుంది. కుజుడు మేష రాశి చక్రం యొక్క పాలక గ్రహం అందువల్ల కుజుడి కారణంగా మేష రాశి వారు భారీ ప్రయోజనాలను పొందుతారు. ఈ సమయంలో వీరికి అదృష్టం కలిసి వస్తుంది. మేషరాశి జాతకులు తమ పనులను విజయవంతంగా పూర్తి చేసుకుంటారు.

లక్కంటే వీరిదే
ఇక ఉద్యోగాలు మారాలనుకునే వారికి ఇది సరైన సమయం. కెరీర్లో మంచి పురోగతికి ఈ సమయంలో స్పష్టమైన అవకాశాలు ఉన్నాయి. మేష రాశి వారి జీవితం సంతోషంగా సంతృప్తిగా ఈ సమయంలో ఉంటుంది. అంగారకుడి ప్రభావం వల్ల మేష రాశి వారికి ధైర్యసాహసాలు పెరుగుతాయి. వివాహితుల జీవితం సంతోషంగా ఉంటుంది.ఈ సమయంలో లక్కంటే వీరిదే.
వృషభ రాశి
వృషభ రాశి వారికి కుజుడి రోహిణి నక్షత్రంలో సంచరించడం చాలా ఫలవంతంగా ఉంటుంది. ఈ సమయంలో వృషభ రాశి వారు ఆకస్మిక ధన లాభాలను పొందుతారు. వృషభ రాశి జాతకులు ఆర్థిక స్థితి బలోపేతం అవుతుంది. వ్యాపారస్తులు లాభాలను అర్జించే అవకాశం ఉంది. ఈ సమయంలో ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి.
మకర రాశి
రోహిణి నక్షత్రంలో కుజసంచారం కారణంగా మకర రాశి వారికి భారీ ప్రయోజనాలు చేకూరుతాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. ఈ సమయంలో ఆస్తులు మరియు వాహనాలకు కొనుగోలుకు అవకాశం ఉంది. ఇది మకర రాశి వారికి అదృష్ట కాలం. విదేశీ పర్యటనలు చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో చేసే ప్రయాణాలు కూడా మకర రాశి వారికి ప్రయోజనాలను ఇస్తాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications