నేటినుండి ఈ రాశుల వారికి కుబేర యోగం వరమిచ్చిన కుజుడు!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం కారణంగా అన్ని రాశుల వారి జీవితాల పైన ప్రభావం పడుతుందని ప్రతి ఒక్కరికి తెలిసిందే. గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తాయని, ఈ సంచారం కొన్ని రాశులకు శుభ ఫలితాలను, మరికొన్ని రాశులకు అశుభ ఫలితాలను ఇస్తుందని కూడా తెలిసిందే. ప్రస్తుతం జూలై నెలలో కుజ సంచారం జరుగుతుంది.
కన్యా రాశిలో కుజ సంచారం
కొన్ని రాశులకు కుజుడు అశుభ ఫలితాలను ఇస్తుంటే, మరికొన్ని రాశులకు కుజుడు అశుభ ఫలితాలను ఇస్తున్నాడు. నేడు కుజుడు కన్యారాశిలోకి సంచరిస్తున్నాడు. కన్య రాశికి బుధుడు అధిపతి. కన్యరాశిలో కుజుడు సంచరించడం వల్ల కొన్ని రాశులకు నేటి నుంచి మంచి ఫలితాలు రాబోతున్నాయి. నేడు సాయంత్రం 7గంటల 2నిమిషాలకు కుజుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. కన్యా రాశిలో కుజ సంచారం కారణంగా లబ్ధిని పొందే రాశులు ఏమిటో తెలుసుకుందాం.

కన్య రాశి
కన్య రాశిలో కుజుడు సంచారం కన్యా రాశి వారికి లాభాలను తెస్తుంది. ఉద్యోగస్తులకు శుభాలను చేకూరుస్తుంది. సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని కుజుడు పెంచడం వల్ల ఈ సమయంలో ఏ పనైనా ఈజీగా పూర్తి చేయగలుగుతారు. కొత్త విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి పెరుగుతుంది. నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి, ఆరోగ్య ప్రణాళికలను ప్రారంభించడానికి కన్య రాశి వారికి ఇది ఉత్తమ సమయం.
కర్కాటక రాశి
కన్యరాశిలో కుజ సంచారం కర్కాటకరాశి వారికి అద్భుతమైన సమయంగా మారుతుంది. ఈ సమయంలో వీరి జీవితంపైన నమ్మకంతో ఉంటారు. ఏ పనినైనా ఇట్టే పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఎవరితోనైనా విభేదాలు ఉంటే ఓపికగా ఆ సమస్యలను పరిష్కరించుకుంటారు. కర్కాటక రాశి వారు ఈ సమయంలో ఎటువంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కోరు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి కుజుడు కన్యారాశిలో సంచరించడం వల్ల ఆర్థిక లాభాలు ఉంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఉద్యోగం చేసే వారికి మంచి ఆదాయం వస్తుంది. ఉన్నతాధికారులు ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడానికి సహాయం చేస్తారు. పనిచేసే చోట మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తి జీవితంలో మీరు చేసే ప్రణాళికలు విజయవంతమవుతాయి. కుటుంబంలో సమస్యలు తగ్గుతాయి. కుటుంబానికి సంబంధించిన పెట్టుబడులు పెట్టే వారికి కలిసి వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.
ధనుస్సు రాశి
కన్య రాశిలో కుజ సంచారం ధనుస్సు రాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. ధనుస్సు రాశివారు ఈ సమయంలో వృత్తిలో అభివృద్ధి చెందుతారు. పనిచేసే చోట జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. డబ్బు పొదుపు చేసే అవకాశం ఉంటుంది. ధనస్సు రాశి వారికి నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. ఆరోగ్యం బాగుంటుంది.
మకర రాశి
కుజుడు కన్యారాశిలో సంచరించడం వల్ల మకర రాశి వారి అదృష్టం బలపడుతుంది. ఈ రాశి వారు వివిధ ఒప్పందాల ద్వారా గొప్ప ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. అంతేకాకుండా ఉద్యోగంలో సహోద్యోగులు, సీనియర్ల మద్దతుతో ముందుకు వెళతారు. వృత్తి జీవితంలో కొత్త స్థానాలను పొందే అవకాశం ఉంది. వ్యాపారం చేసేవారు లాభాలు గడిస్తారు. కుటుంబ జీవితంలో పెద్దగా సమస్యలు ఉండవు. ప్రశాంతంగా సమస్యలను పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications