45 రోజులు వీరికి డబ్బు నష్టం కలిగిస్తానని కుజుడి హెచ్చరిక!
వేద జ్యోతిష్య శాస్త్రంలో అంగారకుడు మిధునరాశిని వీడి కర్కాటకరాశిలోకి ప్రవేశిస్తున్న సమయం ద్వాదశ రాశులవారికి సానుకూల, ప్రతికూల ఫలితాలను కలిగిస్తుంది. అక్టోబర్ 20వ తేదీన కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు.. కర్కాటక రాశి కుజుడికి బలహీనరాశి కర్కాటక రాశిలో కుజ సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంటే మరికొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలను ఇస్తున్నాడు. దీపావళికి ముందు కుజుడు ఎవరికి కష్టాలు ఇవ్వబోతున్నాడు అనేది తెలుసుకుందాం.
మేషరాశి
కుజ సంచారం వల్ల మేష రాశి వారికి ఇబ్బందులు ఎదురవుతాయి. మేష రాశి వారి కుటుంబ జీవితంలో సమస్యలు ఉంటాయి. కెరీర్ పరంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటారు. మేష రాశి వారి ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. ఖర్చులు బాగా పెరుగుతాయి. మేష రాశి వారు ఈ సమయంలో ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి.

సింహరాశి
సింహ రాశి వారికి కుజ సంచారం కారణంగా తీవ్ర సమస్యలు రాబోతున్నాయి. ఉద్యోగం చేసేవారు ఉన్నతాధికారుల నుండి ఒత్తిడిని ఎదుర్కొంటారు. గొప్ప అవకాశాలు చేజారే అవకాశం కనిపిస్తుంది. వ్యక్తిగత జీవితం చిరాకుగా ఉంటుంది. విపరీతంగా ఖర్చులు పెరిగి ఆర్థిక ఇబ్బందులకు లోనవుతారు. భాగస్వామ్య వ్యాపారం చేసేవారు భాగస్వాముల చేతిలో మోసపోయే అవకాశం ఉంటుంది. ఊహించని సమస్యలు వచ్చి పడతాయి. మొత్తం 45రోజులపాటు సింహ రాశి వారికి ఇబ్బందికర వాతావరణం ఉంటుంది.
ధనుస్సు రాశి
కుజ సంచారం కారణంగా ధనుస్సు రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. కెరీర్లో సమస్యలు ఉన్నాయి. పని భారం ఈ సమయంలో ఎక్కువవుతుంది. ఉద్యోగం మారాలనుకునే వారికి ఇది మంచి సమయం కాదు. వ్యాపారాలు చేసేవారు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరోగ్య సమస్యలు ఈ సమయంలో ఇబ్బంది పెడతాయి.
మీనరాశి
కుజ సంచారం కారణంగా మీన రాశి వారికి కష్టాలు వస్తాయి. భాగస్వామ్య వ్యాపారం చేసే వారికి చిరాకులు ఎదురవుతాయి. వ్యక్తిగత జీవితం కూడా ఇబ్బందులతో కూడుకొని ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి సరైన మద్దతు లభించదు. ఈ సమయంలో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. చేసే పనులలో ఆటంకాలు వస్తాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications