అక్టోబర్ నెలలో ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టి కుబేరులయ్యే రాశులివే!
వేద జ్యోతిష్య శాస్త్రంలో అక్టోబర్ మాసంలో ముఖ్య గ్రహాల కదలికల కారణంగా అన్ని రాశుల వారి జీవితాలు ప్రభావితమవుతాయి. గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుండి మరొక రాశిలోకి సంచారం చేస్తూ అన్ని రాశుల వారి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. అక్టోబర్ మాసంలో బుధుడు కుజుడు సంయోగం తుల రాశిలో జరగబోతుంది.
బుధ కుజుల సంయోగం
బుధుడు తెలివితేటలకు, వ్యాపారం, డబ్బు మొదలైన వాటికి కారకుడు. ఇక కుజుడు ధైర్యానికి, శక్తికి, ఆశయానికి కారకుడు. అటువంటి బుధుడు, కుజుడు సంయోగం చెందడం అక్టోబర్ మాసంలో జరుగుతుంది. ఈ రెండు గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది.

కర్కాటక రాశి
అక్టోబర్ మాసంలో బుధుడు మరియు కుజుని కలయిక కరణంగా కర్కాటకరాశి జాతకులు శుభ ఫలితాలను చూస్తారు. ఈ సమయంలో కర్కాటక రాశి జాతకులు జీవితం సంతోషదాయకం గా ఉంటుంది. ఆర్థిక పురోగతి ఉంటుంది. వర్తక వ్యాపారాలు కలిసి వస్తాయి. గతంలో పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ నుంచి ఎక్కువ లాభాలు వస్తాయి. విద్యార్థులకు ఇది మంచి సమయం. పోటీ పరీక్షలు రాసేవారు ఈ సమయంలో సక్సెస్ అవుతారు. వివాహితులు పిల్లలనుంచి శుభవార్తలు వింటారు.
కన్యారాశి
అక్టోబర్ మాసంలో బుధుడు మరియు కుజుని కలయిక కారణంగా కన్య రాశి జాతకులు శుభ ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో కన్యా రాశి వారికి వ్యాపారాలలో లాభాలు వస్తాయి భూములకు సంబంధించిన సానుకూల ఫలితాలు చూస్తారు. దానధర్మాలు చేస్తే శుభ ఫలితాలు వస్తాయి పూర్వీకుల నుండి ఆస్తి వస్తుంది.
వృశ్చిక రాశి
అక్టోబర్ మాసంలో బుధుడు మరియు కుజుని కలయిక కారణంగా వృశ్చిక రాశి జాతకులు సానుకూల ఫలితాలు చూస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోతాయి. ఈ సమయం వృశ్చిక రాశి వారికి శుభవార్తలు వినే సమయం. రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి లాభాలు వస్తాయి. ఆర్థికపరంగా వీరికి చాలా బాగుంటుంది.
మకర రాశి
అక్టోబర్ మాసంలో బుధుడు మరియు కుజుని కలయిక కారణంగా మకర రాశి జాతకులు లబ్ధిని పొందుతారు. ఉద్యోగస్తులకు ఈ సమయంలో కలిసి వస్తుంది. వ్యాపారస్తులకు కూడా ఇది మంచి సమయం. కాంపిటీటివ్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఇది అన్ని విధాలుగా మకర రాశి వారికి శుభ తరుణం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications