త్వరలో బుధాదిత్య రాజయోగం మోసుకొస్తుంది వీరికి సిరిసంపదల యోగం!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రారాజుగా చెప్పుకునే సూర్యభగవానుడు తన సంచారంతో అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాడు. సూర్యుడు సంతోషాన్ని, శ్రేయస్సును, ఆరోగ్యాన్ని, ప్రతిష్టను ఇచ్చేటువంటి దేవుడు. అటువంటి సూర్యభగవానుడు నెలకు ఒకసారి తన రాశిని మార్చుకుంటూ సంచారం చేస్తాడు. ఇక నవగ్రహాలలో ముఖ్యమైన గ్రహంగా గ్రహాన్ని రాకుమారుడిగా భావించే బుధుడు సూర్యుడితో కలిసి బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తున్నాడు.

మేషరాశిలో బుధాదిత్య రాజయోగం
మే 7వ తేదీన బుధుడు మేష రాశిలోకి ప్రవేశిస్తాడు. బుధుడు మేష రాశి లోకి ప్రవేశించినప్పుడు, సూర్యుడు అప్పటికే ఆ రాశిలో సంచరిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ రెండు గ్రహాల కలయిక బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

Mercury and Sun gives wealth to these zodiac signs with Budhaditya RajYoga on may 7th

కర్కాటక రాశి
సూర్యుడు, బుధుడు కలిసి కర్కాటక రాశి వారికి అదృష్టాన్ని ఇస్తున్నాడు. బుధాదిత్య రాజయోగం ఈ రాశిలో పదవ ఇంట్లో ఏర్పడుతుంది. దీనివల్ల వీరికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.

సింహరాశి
సూర్యుడు, బుధుడు కలిసి ఏర్పరిచే బుధాదిత్య రాజయోగం కారణంగా సింహ రాశి వారికి కలిసి వస్తుంది. సింహరాశిలో 9వ ఇంట్లో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో వీరి వైవాహిక జీవితం సంతోష దాయకంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసే వారికి మంచి పురోగతి ఉంటుంది.

తులారాశి
బుధాదిత్య రాజయోగం కారణంగా తులా రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. తులారాశిలో బుధాదిత్య రాజయోగం ఏడవ ఇంట్లో ఏర్పడుతుంది. దీంతో వర్తక వ్యాపారాలు చేసే వారికి మంచి లాభాలు వస్తాయి. కుటుంబ జీవితం సంతోషదాయకం గా ఉంటుంది. వివాహితులు సంతోషంగా జీవిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణం చేస్తారు. ఈ సమయంలో ఆరోగ్యం కూడా మెరుగుగా ఉంటుంది.

మకర రాశి
బుధాదిత్య రాజయోగం కారణంగా మకర రాశి జాతకులు అదృష్ట జాతకులుగా మారుతున్నారు. మకర రాశిలో నాలుగవ ఇంట్లో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా వీరు వాహనాలు, ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ సమయంలో మంచి ఫలితాలు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి పురోగతి కనిపిస్తుంది. స్థిరాస్తి వ్యాపారం ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మకరరాశి వారి ఆరోగ్యం బాగుంటుంది.

కుంభరాశి
బుధాదిత్య రాజయోగం కారణంగా కుంభరాశి జాతకులు అదృష్ట జాతకులు అవుతున్నారు. కుంభ రాశిలో మూడవ ఇంట్లో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. దీనివల్ల కుంభరాశి జాతులకు వర్తక, వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి ఉద్యోగాలు లభిస్తాయి. కుంభరాశి జాతకుల ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుంభ రాశి జాతకులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఈ సమయం అన్ని విధాల శుభదాయకంగా ఉంటుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+