వీరికి త్వరలో కుబేర యోగం అనుగ్రహించిన బుధ శుక్రులు!
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు తమ రాశులను మార్చుకున్నప్పుడు ఇతర గ్రహాలతో కలిసి కొన్ని శుభ యోగాలను, కొన్ని అశుభ యోగాలను ఏర్పరుస్తాయి. ఈ యోగాలు 12 రాశుల వారి జీవితాల పైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఇక నవంబర్ మాసంలో అత్యంత శక్తివంతమైన శుక్ర గ్రహం, బుధ గ్రహం కలయికతో లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది.
బుధ, శుక్రుల కలయికతో లబ్ది పొందే రాశులు
శుక్రుడు సంపదలకు, విలాసాలకు ప్రేమకు అధిపతి. బుధుడు తెలివితేటలు, జ్ఞానానికి ప్రతీక. అటువంటి బుధ, శుక్రుల కలయిక కారణంగా కొన్ని రాశుల వారికి లబ్ది చేకూరుతుంది. ఈ రాజయోగంతో నవంబర్ మాసంలో అదృష్టవంతులు అయ్యే రాశుల వారు ఎవరో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

కన్యారాశి
కన్యా రాశి వారికి నవంబర్ మాసంలో కలిసి వస్తుంది. నవంబర్ మాసంలో బుధ, శుక్రుల కలయిక కారణంగా ఏర్పడిన యోగం కన్యా రాశి వారికి అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో వీరు ఏ పని చేసిన విజయాలు వరిస్తాయి. వీరి మాట తీరుతో ఇతరులు ప్రభావితం అవుతారు. కార్యాలయంలో పనిచేసే చోట అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. కన్యా రాశి వారికి రావలసిన ధనం చేతికి అందుతుంది.
మకర రాశి
మకర రాశి వారికి బుధ శుక్రుల కలయిక అత్యంత శుభప్రదంగా ఉంటుంది. నవంబర్ మాసంలో వీరు శుభ ఫలితాలను చూస్తారు. ఉద్యోగం మారాలనుకుంటే ఇది సరైన సమయం. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా మెరుగుదల కనిపిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఇది మకర రాశి జాతకులకు పూర్తి సంతోషకరమైన సమయం. గత పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.
తులారాశి
తులా రాశి వారికి బుధ శుక్రుల కలయిక సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో తులా రాశి జాతకులు అన్ని విషయాలలో సంతోషంగా ఉంటారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసొస్తుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. తులా రాశి వారి వ్యక్తిత్వం ఈ సమయంలో మెరుగుపడుతుంది . పోటీ పరీక్షలు రాసే వారికి కలిసి వస్తుంది. ఈ సమయంలో తులా రాశి వారికి ఏ పని చేసిన విజయం వరిస్తుంది.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications