సింహరాశిలో బుధ దహనం.. ఈ రాశులవారి ఉద్యోగాలు ప్రమాదంలో... జాగ్రత్త!!
నవగ్రహాలలో బుధ గ్రహం ఒక ప్రధాన గ్రహంగా చెప్పబడింది. కమ్యూనికేషన్ కు నాలెడ్జ్ కు బుధ గ్రహాన్ని ప్రతీకగా చెబుతారు. అయితే అటువంటి బుధుడు ప్రస్తుతం సింహరాశిలో సంచారాన్ని కొనసాగిస్తున్నాడు. బుధుడు సూర్యుని సొంత రాశి అయిన సింహరాశిలో 24 రోజులపాటు ఉండనున్నాడు. ఆ తర్వాత బుధుడు కన్యరాశిలోకి అడుగుపెడతాడు.
సింహరాశిలో బుధ దహనం
అయితే ప్రస్తుతం సూర్యుని రాశి అయిన సింహరాశిలో ఉన్న బుధుడు ఆగస్టు 12వ తేదీ ఉదయం 9:49 నిమిషాలకు సింహరాశిలో దహనం అవుతున్నాడు. బుధుడి దహనం కారణంగా కొన్ని రాశులు ప్రతికూలంగా ప్రభావితం అవుతున్నాయి. ఈ రాశుల వారికి ఈ సమయంలో ఉద్యోగాల విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మేషరాశి
సింహరాశిలో బుధ దహనం కారణంగా మేష రాశి ప్రతికూలంగా ప్రభావితం అవుతుంది. మేషరాశి జాతకులు ఈ సమయంలో కష్టాలను అనుభవిస్తారు. కెరీర్లో ఆశించిన ఫలితాలు ఉండవు. వర్తక వ్యాపారాలలో లాభాలు ఆశించిన మేరకు ఉండవు. ఈ సమయంలో ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు వస్తాయి.
కర్కాటక రాశి
సింహరాశిలో బుధ దహనం కర్కాటక రాశి వారికి ఇబ్బందులను కలిగిస్తుంది. కెరీర్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. వర్తక వ్యాపారాలలోను ఆశించిన మేర ఫలితాలు రావు. ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి. హఠాత్తుగా పెట్టుబడులు పెట్టకుండా ఉండడానికి ప్రయత్నం చేయడం మంచిది.
సింహరాశి
సింహరాశిలో బుధ దహనం కారణంగా సింహరాశి జాతకులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. సింహ రాశి వారు ఉద్యోగాలలో సంతృప్తిగా ఉండలేరు. ఉన్నతాధికారుల మద్దతు లభించదు. సహోద్యోగులతో సమస్యలు ఉంటాయి. ఉద్యోగాలు వదిలేసే అవకాశం కూడా ఉంది. నిరాశ నిస్పృహలు వెంటాడుతాయి. వర్తక వ్యాపారాలు లాభసాటిగా ఉండవు.
తులారాశి
సింహరాశిలో బుధ దహనం తులా రాశి వారికి కష్టాలను తెస్తుంది. ఎంత కష్టపడి పని చేసినా ఉన్నతాధికారుల ప్రశంసలు లభించవు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. అకస్మాత్తు బదిలీలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అనారోగ్య సమస్యలు ఉంటాయి. మానసికంగానూ ఆందోళన ఉంటుంది.
మకర రాశి
సింహరాశిలో బుధ దహనం కారణంగా మకర రాశి వారు చేసే పనులలో అడ్డంకులను ఎదుర్కొంటారు. కెరీర్ పరంగా అసంతృప్తితో, ఒత్తిడితో పని చేస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. అనారోగ్య సమస్యలు కలుగుతాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications