జూన్ లో బుధుడి డబుల్ సంచారం.. వీరికి సంపదల కుంభవృష్టి ఖాయం!
గ్రహాల రాకుమారుడు బుధుడు. బుధుడు జూన్ మాసంలో డబల్ సంచారం చేయబోతున్నాడు. జ్యోతిష్య శాస్త్రంలో బుధుడికి ప్రత్యేకమైన స్థానం ఉంది. బుధుడు వాక్కు, బుద్ధి, వ్యాపారం మొదలైన వాటికి అధిపతిగా చెబుతారు. అటువంటి బుధుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి సంచారం చేస్తూ ద్వాదశ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాడు.
జూన్ లో బుధ సంచారం.. అదృష్ట రాశులు
బుధుడు మిధున రాశిలోనూ, కర్కాటక రాశిలోనూ సంచారం చేయబోతున్నాడు. జూన్ నెలలో రెండుసార్లు బుధ సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఆ రాశుల వారు అపారమైన డబ్బును పొందుతారు. మరి బుధ సంచారం తో అదృష్టం పొందే ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

తులారాశి
బుధ సంచారం తులారాశి వారికి జూన్ మాసంలో అదృష్టాన్ని తీసుకువస్తుంది. బుధుడు తులా రాశిలో అదృష్ట మరియు కర్మ గృహం నుండి ప్రయాణం చేస్తాడు. ఈ సమయంలో తులా రాశి జాతకులు ఏ పని చేసినా కలిసి వస్తుంది. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడి సంతోషంగా ఉంటారు. ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతులు వస్తాయి. చదువు కోసం విదేశాలు వెళ్లాలనుకునే వారి కోరిక తీరుతుంది. .
కన్యారాశి
జూన్ మాసంలో డబల్ బుధ సంచారం కన్యారాశి జాతకులకు శుభ ఫలితాలను ఇస్తుంది. కన్యారాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసిన అదృష్ట లక్ష్మి వరిస్తుంది. వృత్తి వ్యాపారాలు చేసే వారికి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల మన్ననలు లభిస్తాయి. కొత్త ఆదాయ వనరులను సృష్టించుకునే అవకాశం ఉంది. పెట్టుబడుల నుండి ప్రయోజనాలను పొందుతారు.
మీనరాశి
జూన్ మాసంలో రెండుసార్లు బుధ సంచారం మీన రాశి జాతకులకు అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఈ సమయంలో మీనరాశి జాతకులు భౌతిక ఆనందాలను ఆస్వాదిస్తారు. వాహనాలను, ఆస్తులను కొనుగోలు చేస్తారు. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ప్రేమ జీవితంలో విజయం సాధిస్తారు. ఆకస్మిక ఆర్థిక లాభాలను చూస్తారు. ఇది మీన రాశి వారికి అదృష్టాన్నిచ్చే కాలం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications