ఈనెల 22 నుంచి ఈ రాశుల దశ, దిశ తిరుగుతోంది.. అద్భుత ధనయోగం
నవగ్రహాల్లో కీలకమైన బుధుడు గ్రహాలకు రాకుమారుడిలాంటివాడు. తెలివితేటలకు, ఆలోచనల హెచ్చుతగ్గులకు, భావ వ్యక్తీకరణకు కారకుడు. జాతకంలో బుధుడు శుభస్థానంలో ఉంటే జాతకస్తుడి, జాతకస్తురాలి జీవితం చాలా బాగుంటుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఈనెల 22వ తేదీన కుంభరాశిలో బుధుడు ప్రవేశించనున్నాడు. దీనివల్ల నాలుగు రాశులవారి జీవితం పూర్తిగా మారిపోతోంది. ఆ రాశుల వివరాలను తెలుసుకుందాం.
వృషభం
సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. జీవితంలో సంతోషంగా గడుపుతారు. కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారు అవకాశాలను అందుకుంటారు. వీరికి అన్ని విషయాల్లో అదృష్టం తోడుంటుంది. అన్నీ శుభాలే కలుగుతాయి. చేపట్టే ప్రతి పని విజయవంతంగా పూర్తవుతుంది.

సింహం
అదృష్టం ఎక్కువగా ఉంది. కుటుంబ సభ్యల మధ్య మంచి సఖ్యత ఉండి ఆత్మవిశ్వాసంతో పనులు పూర్తిచేస్తారు. కొత్తగా ఆస్తులు కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తున్నవారు ఈ సమయంలో విజయవంతమవుతారు. జీవిత భాగస్వామితో కలిసి జీవితాన్ని సంతోషంగా గడుపుతారు.
కుంభం
ఈ రాశివారికి అదృష్టం తోడుండి అన్ని పనులు సజావుగా పూర్తవుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. కీర్తిప్రతిష్టలు కూడా కలుగుతాయి. ఉద్యోగస్థులకు వారు పనిచేస్తున్న కార్యాలయాల్లో అంతా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరిగి అన్ని పనులు పూర్తిచేసే సామర్థ్యాన్ని సంతరించుకుంటారు.
కన్య
ఈ రాశివారు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబంలో పెద్దల ఆరోగ్యంపై కూడా దృష్టిసారించాలి. పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నవారికి పెళ్లి కుదురుతుంది. వ్యాపారస్తులకు భారీగా లాభాలున్నాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు.












Click it and Unblock the Notifications