మకర రాశిలో బుధుడు... ఈ రాశుల సంపద అనూహ్యంగా పెరుగుతుంది

ఈనెల 24వ తేదీన గ్రహాల రాకుమారుడు బుధుడు మకర రాశిలోకి సంచారం చేస్తున్నాడు. తెలివితేటలకు, లెక్కలకు, కమ్యూనికేషన్ స్కిల్స్ కు బుధుడు కారకుడు. మకరరాశిలోకి ప్రవేశించడంతో మొత్తం 12 రాశులపై ప్రభావం పడుతుంది. ఏ రాశివారికి ఏవిధంగా కలిసివస్తుంది? ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి? శుభ ఫలితాలున్నాయా? అశుభ ఫలితాలున్నాయా? అనే విషయాలను తెలుసుకుందాం.

సింహ రాశి
ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలున్నాయి. అయినప్పటికీ మనసంతా ఆందోళనకు, గందరగోళానికి గురవుతుంది. ప్రయాణాలున్నాయి.

mercury enter in capricorn all zodiac signs will get huge benefits and good health

కన్యా రాశి
సంపద పెరుగుతుంది. వ్యాపారంలో మార్పు వస్తుంది. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది. దేనికీ దుందుడుకుతనం పనికిరాదు. ఓర్పు ఉండాలి.

తులా రాశి
మాటల్లో మాధుర్యం ఉండాలి. వ్యాపారం సంతృప్తినిస్తుంది. కష్టపడి పనిచేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కోపం రాకుండా చూసుకోవాలి.

వృశ్చిక రాశి
వ్యాపారంలో లాభాలున్నాయి. కష్టపడతారు. ఉద్యోగం మారతారు. ఆదాయం పెరిగినప్పటికీ ఖర్చులు కూడా పెరుగుతాయి.

ధనుస్సు రాశి
ఆత్మవిశ్వాసంతో ఉంటారు. బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. వృత్తిలో మార్పులున్నాయి. మనసు ప్రశాంతంగా ఉంటుంది.

మీన రాశి
ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తియ్యగా ఉండే పదార్థాలపై మక్కువ కలుగుతుంది. తక్కువ తినాలి.

మేష రాశి
ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మనసు ఆనందంగా ఉంటుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. మనశ్శాంతిగా ఉంటారు.

వృషభ రాశి
ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీనివల్ల ఆదాయం పెరుగుతుంది. సమాజంలో గౌరవాన్ని పొందుతారు. విద్యార్థులకు విజయం ఉంది.

మిథున రాశి
వీరికి ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. ఖర్చులు పెరిగి ఇబ్బందులు పడతారు. వ్యాపారస్తులకు లాభాలున్నాయి.

కర్కాటక రాశి
వీరికి ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. వ్యాపారంలో ఇబ్బందులున్నాయి. తండ్రి నుంచి మద్దతు లభిస్తుంది. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మకర రాశి
విదేశాలకు చదువుకోవడానికి వెళ్లే అవకాశం ఉంది. ఖర్చులు పెరుగుతాయి. జీవితంలో ఒడిదుడుకులున్నాయి. మనసు ప్రశాంతంగా ఉండేందుకు ప్రయ్నతిస్తారు.

కుంభ రాశి
కోపాన్ని వదులుకుంటారు. విజయానికి బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఆస్తి పెరుగుతుంది. సంతోషంగా ఉంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+