త్వరలో వీరికి అఖండ ధనయోగం.. మాటిచ్చిన గ్రహాల రాకుమారుడు
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాకుమారుడు అయిన బుధుడు అన్ని రాశుల వారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తాడు. బుధుడి రాశి మార్పు ద్వాదశ రాశుల వారి పైన ప్రభావాన్ని చూపిస్తుంది. బుధుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడానికి 14 రోజుల నుంచి 30 రోజుల కాలం పడుతుంది. అంటే ప్రతి నెలలోనూ బుధుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తాడు.
మిధున రాశిలో బుధ సంచారం
సంవత్సరకాలంలో బుధుడు ద్వాదశ రాశులను చుట్టి వస్తాడు. అటువంటి బుధుడు జూన్ ఆరవ తేదీన మిధున రాశిలో సంచారం చేయబోతున్నాడు. మిధున రాశిలో బుధ సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మేషరాశి
మేష రాశి జాతకులకు మిధున రాశిలో బుధ సంచారం కారణంగా కలిసివస్తుంది. ఈ సమయంలో మేషరాశి జాతకులకు శుభప్రదంగా ఉంటుంది. పూర్వీకుల ఆశీర్వాదం లభిస్తుంది. కుటుంబ పెద్దల నుండి సహకారం లభిస్తుంది. సమాజంలో మీ గౌరవం బాగా పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలను పొందుతారు. మేషరాశి జాతకులకు డబ్బులకు సంబంధించిన సమస్యలు బాగా తగ్గుతాయి. ఇది వీరికి శుభ సమయం.
మిధున రాశి
మిధునరాశిలో బుధ సంచారం కారణంగా మిధునరాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో న్యాయ సంబంధితమైన విషయాలలో వీరు విజయాలు సాధిస్తారు. వర్తక వ్యాపారాలు చేసేవారు లాభాలను గడిస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారికి కలిసి వస్తుంది. ఈ సమయంలో మీరు పెట్టే పెట్టుబడులు ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తాయి. ముఖ్యమైన పనుల మీద ప్రయాణాలు చేయవలసి వస్తుంది. అయితే ఈ సమయంలో ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాలి.
సింహరాశి
మిధున రాశిలో బుధ సంచారం కారణంగా సింహరాశి జాతకులకు సానుకూల ప్రయోజనాలు ఉంటాయి. ఎంతోకాలంగా ఆగిపోయిన సింహరాశి వారి పనులు పూర్తవుతాయి. సింహరాశి వారి సంపద పెరుగుతుంది. తల్లి ఆరోగ్యానికి సంబంధించి శుభవార్తలు వింటారు. వ్యాపారస్తులకు ఇది చాలా శుభాలను చేకూరుస్తుంది. సింహ రాశి వారికి ఈ సమయం బాగా కలిసి వస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications