ఈ నెలంతా వీరికి విలాసాలను, రాజభోగాలను వరమిచ్చిన బుధుడు!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ప్రధాన గ్రహాల సంచారం కారణంగా కొన్ని రాశులకు సానుకూల ఫలితాలు మరికొన్ని రాశులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. 2025 జనవరి 8వ తేదీన బుధుడు మకర రాశిలోకి ప్రవేశించాడు. జనవరి 28వ తేదీ వరకు బుధుడు అక్కడే ఉండనున్నాడు .

మకరరాశిలో బుధ సంచారం
బుధుడు జనవరి మాసంలో ధనుస్సు రాశిలోకి, మకర రాశిలోకి వెళుతున్నాడు. బుధుడు మకర రాశిలోకి సంచారం చేయడం వల్ల కొన్ని రాశుల వారు అదృష్టాన్ని అందుకోబోతున్నారు.బుధుడు మకర రాశి సంచారం కొన్ని రాశుల వారి జీవితాలలో సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. ఇక బుధ సంచారం వల్ల జనవరి నెల అంతా అదృష్టాన్ని పొందుతున్న ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

Mercury into capricorn announced these zodiac signs with wealth in January

మేష రాశి
మేష రాశి జాతకులు ఈ సమయంలో వృత్తిలో పురోగతి సాధిస్తారు. ఏ సమస్యలనైనా చాకచక్యంగా పరిష్కరిస్తారు. సేల్స్, రైటింగ్, కమ్యూనికేషన్ మరియు నెట్వర్కింగ్ వంటి కార్యాకలాపాలు చేసే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మేష రాశి వారికి ఈ సమయంలో ఖ్యాతి పెరుగుతుంది. వీరిలో దాగి ఉన్న ప్రతిభ వెలుగులోకి వస్తుంది.

కర్కాటక రాశి
బుధ సంచారం కర్కాటక రాశి వారిని అదృష్ట జాతకులు గా మారుస్తుంది. కర్కాటక రాశి వారు దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించడానికి ఈ సమయం అనుకూలమైన సమయం. కర్కాటక రాశి వారు వృత్తిపరంగా ఈ సమయంలో పురోగతిని చూస్తారు. ఈ సమయంలో వీరు సమస్యలను చాలా తెలివిగా పరిష్కరిస్తారు. ఆర్థికంగా స్థిరత్వాన్ని పొందుతారు. పరస్పర గౌరవాన్ని పెంపొందించుకుంటారు.

మకర రాశి
బుధ సంచారం కారణంగా మకర రాశి వారు సానుకూల ఫలితాలను పొందుతారు. ఆచరణాత్మక మనస్తత్వంతో ఈ సమయంలో వీరు అన్ని రంగాలలోనూ రాణిస్తారు. మకర రాశి వారి సామర్థ్యం ఈ సమయంలో ఊహించని అవకాశాలను ఇస్తుంది. వీరి దృఢమైన వ్యక్తిత్వం విజయానికి దారితీస్తుంది. ఈ సమయంలో వ్యక్తిగత ఎదుగుదల సాధ్యమవుతుంది. ఇక నిర్ణయాలు తీసుకునే విషయంలో గతంలో కంటే చాలా పదునుగా చురుగ్గా ఆలోచిస్తారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+