వీరికి నేటినుండి డబ్బుల మూటలను మోసుకొస్తున్న బుధుడు
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాకుమారుడిగా బుధ గ్రహాన్ని చెబుతారు. బుధుడు తెలివితేటలు జ్ఞానం మరియు కమ్యూనికేషన్ కు ప్రతీకగా భావించే గ్రహం. మిధున రాశి, కన్యా రాశులకు అధిపతి అయిన బుధుడు ఈ రెండు రాశులను ఎప్పుడూ ఆశీర్వదిస్తాడు. బుధుడు బృహస్పతి నక్షత్రమైన పూర్వాభాద్ర నక్షత్రం లోకి నేడు సంచరిస్తున్నాడు.
పూర్వాభాద్ర నక్షత్రంలోకి బుధ సంచారం
ఏప్రిల్ మూడవ తేదీన బుధుడు బృహస్పతి నక్షత్రమైన పూర్వాభాద్ర లోకి సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాలకు సంచారం చేస్తాడు. బుధుడు ప్రస్తుతం మీన రాశిలో ఉన్నాడు. పూర్వాభాద్ర నక్షత్రంలో బుధ సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. వారు ఈ సమయంలో ఏ పని చేసినా కూడా కలిసి వస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

వృషభరాశి
బుధ సంచారం కారణంగా వృషభ రాశి జాతకులకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో, వృషభ రాశి వారు జీవితంలో సానుకూల ఫలితాలను పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఈ సమయంలో కలిసి వస్తుంది. ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. కెరీర్‌లో ప్రమోషన్‌కు అవకాశాలు ఉన్నాయి. మొత్తంమీద ఈ సమయం మీకు పురోగతిని తెస్తుంది.
మిథునరాశి
పూర్వాభాద్ర నక్షత్రంలో బుధ సంచారము మిథున రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఏ పని తలపెట్టినా కూడా సానుకూల ఫలితాలను పొందుతారు. జీవితంలో ఆనందం వస్తుంది. మీరు ఉద్యోగం చేసే చోట విజయం సాధిస్తారు. మీకు ఈ సమయంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. మీ పని అందరితో మన్ననలు పొందుతుంది.
తులారాశి
తుల రాశి వారు బుధ గ్రహ సంచారము వలన ప్రయోజనం పొందవచ్చు. బుధ గ్రహ సంచారం వల్ల తులారాశి వారి జాతకంలో మంచి మార్పులు వస్తాయి. ఆదాయంలో భారీ పెరుగుదల సంకేతాలు ఉన్నాయి. చాలాకాలంగా ఉన్న మీ సమస్యలు పరిష్కరించ బడతాయి. ఈ కాలంలో మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బలంగా ఉంటుంది. ఇది విద్యార్థులకు చాలా మంచి సమయం, వారు పరీక్షలలో విజయం సాధిస్తారు. ఇది తులా రాశి వారికి శుభాలను చేకూర్చే కాలం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications