డిసెంబర్ 15 వరకు ఈ రాశులవారికి కష్టాల తలుపులు తెరిచిన బుధుడు!
గ్రహాల రాకుమారుడుగా చెప్పే బుధుడు ఈనెల 26వ తేదీ నుంచి డిసెంబర్ 15వరకు వక్రమార్గంలో ప్రయాణం చేస్తున్నాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారు కష్టాలను నష్టాలను ఎదురుకోబోతున్నారు. ముఖ్యంగా బుధుడు తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఆ రాశుల వారు ఆర్థిక వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. నవంబర్ 26వ తేదీ నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు ఇబ్బందులను ఎదుర్కోబోయే ఆ రాశులేమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
మేషరాశి
మేషరాశిలో 8వ స్థానంలో బుధుడు వక్రీకరిస్తున్నాడు. దీని కారణంగా మేషరాశి జాతకులు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వివాదాలలో చిక్కుకునే అవకాశం ఉంది. పొరపాటున కూడా ఎటువంటి డాక్యుమెంట్ల మీద సంతకాలు చేయకూడదు. ఏవైనా వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవాలనుకుంటే ఒకటికి పది సార్లు ఆలోచించాలి. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

కర్కాటక రాశి
కర్కాటక రాశిలో పంచమ స్థానంలో బుధుడు వక్రీకరిస్తున్నాడు. దీని కారణంగా కర్కాటక రాశి జాతకులు వృత్తి, వ్యాపారాలు, ఉద్యోగాలలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. కుటుంబంలో కలహాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారాలలో భారీగా నష్టపోవడంతో పాటు కొత్త సమస్యలు వచ్చి పడతాయి. పేరు ప్రతిష్టలకు భంగం కలిగే అవకాశం ఉంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు ఈ సమయంలో కొన్ని తప్పుడు నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది.
సింహరాశి
సింహరాశిలో నాలుగవ స్థానంలో బుధుడు వక్రీకరిస్తున్నాడు. దీని కారణంగా సింహరాశి వారు ఆస్తి సంబంధిత విషయాలలో తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబంలో కలహాలు వస్తాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. తీవ్రమైన ఒత్తిడితో బాధపడవలసి వస్తుంది. పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే ఆర్థికంగా నష్టపోతారు. ఈ రాశి వారికి ఈ సమయంలో సుఖసంతోషాలకు అవకాశమే లేదు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశిలోనే బుధుడు వక్రగతిలో ప్రయాణం చేస్తున్నాడు. దీని కారణంగా వృశ్చిక రాశి జాతకులు శ్రమకు తగిన ఫలితం లేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. వృత్తి వ్యాపారాలలోనూ కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. దాంపత్య జీవితం సవ్యంగా సాగదు. వర్తక వ్యాపారాలు చేసేవారు ఇబ్బందులు ఎదుర్కొంటారు. వ్యక్తిగత సమస్యలు తీవ్రమైన ఆందోళనలకు కారణమవుతాయి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి 12వ స్థానంలో బుధుడు వక్రీకరిస్తున్నాడు. దీని కారణంగా ధనుస్సు రాశి జాతకులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆరోగ్యం పాడై వైద్య ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఏ పని చేసిన అది విఫలం అవుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం రాక తీవ్రమైన మానసిక వేదనను ఎదుర్కొంటారు. బంధువులు శత్రువులుగా మారుతారు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
మీనరాశి
మీన రాశి వారికి భాగ్యస్థానంలో బుధుడు వక్రీకరించడం కారణంగా వీరి శుభకార్యాలకు అడ్డంకులు ఏర్పడతాయి. మీన రాశి వారు ఆస్తి వ్యవహారాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారి ప్రయత్నాలు నిలిచిపోతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలలో ఆటంకాలు ఏర్పడతాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications