ఆగస్ట్ లో బుధుడి దయతో వీరికి పట్టిందల్లా బంగారం!!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం కారణంగా జాతకాలు మారతాయి.ఆ గస్ట్ నెలలో ముఖ్య గ్రహాల రవాణా కొనసాగనుంది. ఆగస్ట్ నెలలో గ్రహాలు వివిధ రాశులలో సంచరించటం, తిరోగమనంలో ప్రయాణించటం వెరసి ఆగస్ట్ నెలలో అనేక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. గ్రహాల రాకుమారుడు అయిన బుధుడు ప్రస్తుతం సింహరాశిలో సంచరిస్తున్నాడు.
సింహరాశిలో తిరోగమనంలో బుధుడు
ఆగస్టు 5వ తేదీ నుంచి సింహరాశిలో బుధుడు తిరోగమనం చేయనున్నాడు. ఆగస్టు 24 2024వ తేదీ వరకు బుధ గ్రహం తిరోగమనంలోనే ఉంటుంది. బుధుడి తిరోగమన సంచారం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆగస్ట్ లో బుధుడి దయతో వీరికి పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక ఆగస్టు నెలలో బుధ తిరోగమనం ఏ రాశుల వారికి లబ్ధిని చేకూరుస్తుంది అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మిధున రాశి
బుధుడి తిరోగమనం మిధున రాశి వారికి లబ్ధిని చేకూరుస్తుంది. మిధున రాశి వారు ఈ సమయంలో ఆర్థిక లాభాలు పొందుతారు. వర్తక వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. నిలిచిపోయిన పనులు పూర్తి అవుతాయి. కుటుంబ సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఈ సమయంలో కొన్ని శుభవార్తలను వింటారు.
సింహరాశి
సింహరాశిలో బుధుడి తిరోగమనం సింహ రాశి వారికి అదృష్టాన్ని తెస్తుంది. ఎప్పటినుంచో వసూలు కానీ బాకీలు వసూలు అవుతాయి. ఈ సమయంలో సంపద పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వారికి భారీ లాభాలు వస్తాయి. కొనుగోలు అమ్మకాలలో ఊహించని ఆర్థిక లాభాలతో సింహరాశి జాతకులు సంతోషంగా ఉంటారు.
కన్యా రాశి
బుధుడి తిరోగమన కారణంగా కన్యారాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో కన్యా రాశి వారికి ఆర్థిక లాభాలు చేకూరుతాయి. పెండింగ్ పనులు పూర్తవుతాయి. రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుంది. అధికారులతో సత్ సంబంధాలు కొనసాగుతాయి కొన్ని శుభవార్తలను వింటారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.
ధనుస్సు రాశి
బుధుడి తిరోగమన కారణంగా ధనుస్సు రాశి వారికి ప్రయోజనం కలుగుతుంది. ధనుస్సు రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక లాభాలు కలుగుతాయి. భూమి ఆస్తులు ఊహించని లాభాలను ఇస్తాయి. వ్యాపారులకు ఇది అనుకూలమైన సమయం. మీ పాత స్నేహితులను కలుసుకోవడంతో ఈ సమయంలో సంతోషంగా ఉంటారు. ఉన్నతాధికారులతోనూ మెరుగైన సంబంధాలను కొనసాగిస్తారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications