మార్చిలో మీనరాశిలో బుధుడి ఉదయం: ఈ రాశులవారు డబ్బు విషయంలో జాగ్రత్త!!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, మార్పు అన్ని రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది. మార్చి 15వ తేదీన ఉదయం 1.07 నిముషాలకు మీనరాశిలో బుధుడు ఉదయిస్తాడు. బుధుడు కమ్యూనికేషన్ కు సంబంధించిన గ్రహం . బుధుడు సూర్యుడికి అత్యంత సమీపంలో ఉండే గ్రహం కాబట్టి ఎక్కువ సమయం బుధుడు దహన స్థితిలోనే ఉంటాడు. కానీ మార్చి 15న బుధ గ్రహం పెరుగుతుంది.
బుధుడు మార్చి 15న ఉదయిస్తాడు. ఈ పరిణామం ముఖ్యంగా కొన్ని గ్రహాలకు ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. మీనరాశిలో బుధుడి ఉదయం వలన కొన్ని రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. మీనరాశిలో బుధుడి ఉదయం ముఖ్యంగా మేషరాశి జాతకులకు ఇబ్బందులు తెచ్చి పెడుతుంది. ఈ సమయంలో మేషరాశి జాతకుల ఆరోగ్యం క్షీణించవచ్చు.

ఈ సమయంలో మేషరాశి వారిని ఒక వ్యాధి చుట్టుముట్టి ఇబ్బంది పెట్టవచ్చు. దీనికోసం మీరు చాలా డబ్బులు ఖర్చు చేయవలసి వస్తుంది. ఈ సమయంలో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఈ కారణంగా మీరు మానసిక ఒత్తిడికి గురవుతారు. వర్తక, వ్యాపారాలలో మీ శత్రువులు బలాన్ని పుంజుకుంటారు. అది మీకు ఇబ్బందులను తెచ్చి పెడుతుంది. ఉద్యోగాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి.
సింహరాశి వారికి కూడా మీనరాశిలో బుధుడి ఉదయం నష్టాన్ని చేస్తుంది. కష్టాలను తెస్తుంది. సింహరాశి జాతకులు ఈ సమయంలో ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి. కుటుంబపరంగా వివాదాలు వచ్చే అవకాశం ఉంది. ఆదాయాన్ని సరైన విధంగా పెట్టుబడి పెడితే ఫలితం బాగుంటుంది. లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది. షేర్ మార్కెట్లో ఈ సమయంలో పెట్టుబడి పెట్టటం మానుకోండి. పనిచేసేచోట ప్రత్యర్థులు మీకు వ్యతిరేకంగా కొన్ని అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంది.
మీనరాశిలో బుధుడి ఉదయం తులారాశి వారికి ప్రతికూల ఫలితాలు ఇస్తుంది. తులారాశి జాతకులకు ఈ సమయంలో శత్రువుల నుండి ఇబ్బందులు ఎదురు కావచ్చు. ఈ సమయంలో ఖర్చులు బాగా పెరుగుతాయి. విజయం కోసం మీరు అదనంగా కష్టపడాలి. పెరిగిన ఖర్చుల కారణంగా మీ ఆర్ధిక పరిస్థితి బలహీన పడే అవకాశం ఉంది. ఈ సమయంలో ఎవరికైనా డబ్బిస్తే తిరిగి వచ్చే అవకాశం లేదు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలని సూచించబడింది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications