త్వరలో మీనరాశిలో ఉదయించి వీరి జీవితాలను బంగారుమయం చేస్తానన్న బుధుడు
వేద జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. గ్రహాల రాకుమారుడిగా చెప్పుకునే బుధుడి సంచారం అన్ని రాశుల వారిపైన ప్రభావాన్ని చూపిస్తుంది. కమ్యూనికేషన్ కు ప్రతినిధిగా బుధుడిని చెప్పుకుంటారు. వ్యాపార విజయాన్ని అందించే బుధుడు ఏప్రిల్ మాసంలో మీనరాశిలో ఉదయిస్తాడు. మీన రాశిలో బుధుడు ఉదయం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
మీనరాశిలో బుధుడి ఉదయం
వారు ఈ సమయంలో ఏ పని చేసినా తిరుగే ఉండదు. సకల సంపదలు, సౌభాగ్యాలతో ఈ సమయంలో బుధ సంచారం కారణంగా వివిధ రాశులవారికి అదృష్టం కలిసి వస్తుంది. మీనరాశిలో బుధుడి ఉదయం కారణంగా అదృష్టవంతులు అవుతున్న ఆ రాశుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

వృషభ రాశి
వృషభ రాశి వారికి బుధుడు ఉదయం కారణంగా శుభాలు చేకూరుతాయి. ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్న సమస్యలు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. వృషభ రాశి జాతకులు ముఖ్యంగా ఆర్థిక విషయాలలో బాగా పురోగతిని సాధిస్తారు. చాలా విషయాల్లో వృషభరాశి వారికి తిరుగే ఉండదు.
మిధున రాశి
మిధున రాశి వారికి బుధుడి ఉదయం కారణంగా ఊహించని సానుకూల ఫలితాలు వస్తాయి . వీరి కర్మ ఇంట్లో బుధుడు ఉదయిస్తాడు. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మిధునరాశి వారి ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగవుతుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో చాలా సంతోషంగా జీవిస్తారు. తోబుట్టువులు, బంధువుల నుంచి మిధున రాశి వారికి మద్దతు లభిస్తుంది. ఏ పని చేసిన అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వారికి సానుకూల ఫలితం ఉంటుంది.
కుంభ రాశి
కుంభ రాశి వారికి మీనరాశిలో బుధుడు ఉదయించడం కారణంగా శుభాలు జరుగుతాయి. కుంభరాశిలో బుధుడు రెండవ స్థానంలో ఉదయిస్తున్నందున ఈ సమయం వీరికి అదృష్టాన్ని ఇస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆస్తులు కొనాలనుకునే వారికి ఈ సమయం సానుకూల సమయం. ఈ సమయంలో వీరికి ధన ప్రయోజనాలు కలుగుతాయి. వర్తక, వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కార్యాలయాలలో ప్రశంసలు దక్కుతాయి. ఇది కుంభరాశి వారికి అదృష్ట సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications