మేషరాశిలోకి బుధుడు.. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాలపై ప్రభావాలు ఇలా!!

గ్రహాల గమనం కారణంగా అన్ని రాశుల వారి జీవితాలపైన ప్రభావం పడుతుంది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలలో వివిధ మార్పులు చోటు చేసుకుంటాయి. మే 10వ తేదీన మేష రాశిలోకి బుధుడు ప్రవేశిస్తున్నాడు. మే 10న బుధుడు సాయంత్రం 6:39 నిమిషాలకు మేష రాశిలోకి రవాణా అవుతాడు.

మేషరాశిలో బుధుడు.. వ్యాపార రంగంపై ప్రభావం
మేషరాశి లోకి బుధ గ్రహ రవాణా కారణంగా ప్రపంచవ్యాప్తంగానూ, దేశవ్యాప్తంగాను అనేక ప్రభావాలు చోటుచేసుకుంటాయి. ఇక వాటిని గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం. బుధుడు వ్యాపారానికి కారకుడు కాబట్టి మేషరాశిలో బుధ సంచారం కచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా వ్యాపారాలకు ప్రోత్సాహాన్ని ఇవ్వవచ్చు. మేష రాశిలో బుధ గ్రహ రవాణా కారణంగా వ్యాపారం మరియు స్పెక్యులేషన్ రంగం పైన ప్రభావం పడుతుంది.

Mercury transit in Aries These are the effects on different sectors around the world

స్టాక్ మార్కెట్ లలో సానుకూల పెరుగుదల
ఇప్పటికే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతోంది. మేషరాశిలో బుధ సంచారం కారణంగా ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ కంపెనీలలో సంక్షోభం కాస్త తగ్గవచ్చు. స్టాక్ మార్కెట్లు ఒక నిస్తేజమైన దశ తర్వాత, మళ్లీ కాస్త సానుకూల పెరుగుదలను చూడవచ్చు. అయితే ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా అనేక వ్యాపారాలు కుప్పకూలే ప్రమాదం కూడా లేకపోలేదు. ఇది కొన్ని ప్రధాన రంగాలను ప్రభావితం కూడా చేయవచ్చు.

పురోగతి సాధించే రంగాలివే
ఈ సమయంలో బ్యాంకింగ్ మరియు ఆర్థిక రంగాలు స్థిరత్వాన్ని మరియు పెరుగుదలను చూడవచ్చు. మేషరాశిలో బుధ సంచారం కారణంగా ఔషధ రంగం, విద్యుత్ రంగం,రసాయన పరిశ్రమలు, ప్రభుత్వ రంగాలు మంచి పనితీరును కనబరిచే అవకాశం ఉంది. ఎలక్ట్రికల్ ఉత్పత్తుల పరిశ్రమ, ఎలక్ట్రానిక్స్, వజ్రాల పరిశ్రమ, కెమికల్, హెవీ ఇంజనీరింగ్ పరిశ్రమలు అన్ని పురోగతిని సాధిస్తాయి.

కళాకారులకు గుర్తింపు, మీడియా వర్గాలకు బూస్ట్
ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నృత్యకారులు, గాయకులు తమ కళల ద్వారా కీర్తి ప్రతిష్టలను పొందవచ్చు. గుర్తింపు లేకుండా మరుగున పడిపోతున్న కళాకారులు మళ్లీ తిరిగి కొంత వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మీడియా, జర్నలిజం, రచనా రంగాలకు చెందిన వారికి ఈ సమయంలో గుర్తింపు వస్తుంది. కంటెంట్ రైటింగ్ చేసేవారు, క్రియేటివ్ రైటర్లు ఈ కాలంలో బాగా పురోగతి సాధిస్తారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+