సూర్యుడి రాశిలోకి బుధుడు: జులై 19నుండి వీరి పంట పండుతుంది!!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాకుమారుడు కమ్యూనికేషన్ ను, శాంతిని, శ్రేయస్సును పెంచే గ్రహం అయిన బుధుడు రాశి మార్పు అన్ని రాశుల వారి పైన ప్రభావాన్ని చూపిస్తుంది. వేద జ్యోతిష్య శాస్త్రంలో బుధసంచారం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. జులై 19వ తేదీన బుధుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. బుధుడు సింహరాశిలోకి ప్రవేశించడం కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధన లాభాన్ని తీసుకువస్తుంది.
సూర్యుడి రాశిలోకి బుధుడు
సింహరాశికి సూర్యుడు అధిపతి కావడం, సూర్యుడు బుధ గ్రహాల మధ్య స్నేహపూర్వక భావన ఉండడం కొన్ని రాశుల వారికి విజయాలను చేకూరుస్తుంది. సూర్యుడు సొంత రాశి అయిన సింహరాశి లోకి బుధుడు ప్రవేశించడం వల్ల కొన్ని రాశుల వారి అదృష్టం ప్రకాశిస్తుంది. మరి ఆ రాశులేమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

వృషభ రాశి
సింహరాశిలో బుధ గ్రహ గోచారం కారణంగా వృషభ రాశి వారికి సత్ఫలితాలు వస్తాయి. ఉద్యోగం చేసేవారు ఉన్నతాధికారుల మన్ననలు పొందుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఈ సమయంలో అదృష్టం మీ వెంటే ఉంటుంది. వృషభ రాశి జాతకులు ఈ సమయంలో ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు.
కర్కాటక రాశి
బుధ సంచారం కారణంగా కర్కాటక రాశి జాతకులకు లబ్ది చేకూరుతుంది. వ్యాపారస్తులకు ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. వైవాహిక జీవితం సుఖవంతంగా ఉంటుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు కలుగుతాయి. ఈ సమయంలో ఏ పని చేపట్టిన విజయం చేకూరుతుంది. ఉద్యోగ, వ్యాపారాలు చేసే వారికి అత్యంత లాభదాయకంగా ఉంటుంది
సింహరాశి
సింహరాశిలో బుధ గ్రహ గోచారం లబ్ధిని చేకూరుస్తుంది. ఈ సమయంలో ధనలక్ష్మి కటాక్షం కలుగుతుంది.. సోదరులు సోదరీమణుల నుంచి ఊహించని మద్దతు దొరుకుతుంది ఉద్యోగ, వ్యాపారాలు చేసే వారికి అత్యంత లాభదాయకంగా ఉంటుంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు కలుగుతాయి. కొత్త ఇంటిని కాని వాహనాన్ని కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంది.
కన్యా రాశి
కన్యా రాశి జాతకులకు బుధ గ్రహగోచారం కారణంగా సానుకూల ఫలితాలు వస్తాయి. కన్యా రాశి వారికి ఈ సమయం ఆర్థిక లాభాలు ఉంటాయి. జీవితం ప్రశాంతంగా సాగుతుంది. ఉద్యోగ వ్యాపారాలు చేసుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుంది.
ధనస్సు రాశి
ధనస్సు రాశి జాతకులకు బుధగ్రహ గోచారం శుభ ఫలితాలను ఇస్తుంది. పెట్టిన పెట్టుబడుల ద్వారా లాభాలు వస్తాయి . వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఈ సమయంలో ధనుస్సు రాశి వారికి ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి అందుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పరీక్షలు రాసే వారికి ఇది శుభ సమయం .ఉద్యోగాలు చేసే చోట ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications