ఆగస్టు 9న బుధోదయంతో వీరు నక్కతోక తొక్కుతున్నారు!
వేద జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహానికి ఒక నిర్దిష్టమైన ప్రాధాన్యత ఉంటుంది. గ్రహాల రాకుమారుడిగా భావించే బుధుడు జూలై 24వ తేదీన కర్కాటకరాశిలో అస్తమించాడు. ఆ తర్వాత ఆగస్టు 9వ తేదీన ఉదయించనున్నాడు. ఆగస్టు 9వతేదీన బుధుడు ఉదయం కారణంగా అన్ని రాశులవారి జీవితాలపైన ప్రభావం పడుతుంది. కొన్ని రాశులవారు శుభ ఫలితాలు, మరికొన్ని రాశులవారు అశుభ ఫలితాలు పొందుతారు. బుధోదయం కారణంగా లబ్దిని పొందే ఆ రాశులను తెలుసుకుందాం.
మేషరాశి
మేషరాశిలో బుధుడు మూడవ ఇంటికి, 6వ ఇంటికి అధిపతి. బుధుడు మేష రాశిలో నాలుగవ ఇంట్లో ఉదయించడం వల్ల ఈరోజు వారికి శుభప్రదంగా ఉంటుంది. నాలుగవ ఇంట్లో బుధ సంచారం సహజంగా సానుకూల ఫలితాలను ఇస్తుంది. పనిలో సమస్యలు ఎదుర్కొనే వారు ఈ సమయంలో సమస్యల నుండి బయటకు వస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. మంచి ఫలితాల కోసం మేష రాశి వారి పక్షులకు ఆహారం పెడితే మంచిది.

మిధున రాశి
మిధున రాశి వారికి బుధుడు నాల్గవ ఇంటికి అధిపతి. ఈ రాశివారికి బుధుడు పాలక గ్రహం కూడా. మిధునరాశిలో బుధుడు రెండవ ఇంట్లో ఉదయిస్తాడు. దీంతో ఈ సమయంలో వీరికి మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. డబ్బు సంపాదించడానికి ఇది సరైన సమయం. నగలు, దుస్తులు కొనుగోలు చేస్తారు. విద్యారంగంలో ఉన్నవారికి పురోగతి ఉంటుంది. అనుకూల ఫలితాలు పొందడానికి గణేష్ చాలీసా చదవడం మంచిది.
కన్యారాశి
కన్యా రాశి వారికి బుధుడు లగ్నానికి, కర్మ ఇంటికి అధిపతి. లాభ గృహంలో బుధుడు ఉదయిస్తున్నాడు. ఇక బుధుడి ఉదయం కారణంగా కన్యా రాశి వారి జీవితం బాగుంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆదాయం పెరుగుతుంది. వృత్తి జీవితంలో పదోన్నతులు లభిస్తాయి. ఉద్యోగ జీవితంలో కృషికి తగిన ఫలితం ఉంటుంది. పిల్లల నుండి ఆనందం పొందుతారు. ఉత్తమ ఫలితాల కోసం ప్రతిరోజు గణపతి అధర్వ శీర్ష పఠించాలి.
తులారాశి
తులా రాశి వారికి బుధుడు అదృష్ట గృహానికి, 12వ ఇంటికి అధిపతి. బుధుడు తులా రాశిలో కర్మ గృహంలో ఉదయిస్తాడు. బుధుడి ఉదయం కారణంగా తులా రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో వీరికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసేవారు మంచి లాభాలు పొందుతారు. మరింత అనుకూల ఫలితాలు కోసం గుడిలో పాలు, బియ్యం దానం చేయాలి.
ధనస్సు రాశి
ధనస్సు రాశి వారికి బుధుడు ఏడవ ఇంటికి, కర్మ ఇంటికి అధిపతి. ధనస్సు రాశిలో బుధుడు ఎనిమిదవ ఇంట్లో ఉదయించడం వల్ల వీరికి ఆకస్మిక ధనలాభం వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఎప్పటి నుంచొ వసూలు కానీ మొండి బాకీలు వసూలు అవుతాయి. వైవాహిక జీవితం బాగుంటుంది. ఉద్యోగంలో ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. మెరుగైన ఫలితాలకు శివలింగానికి తేనెతో అభిషేకం చేయండి.
కుంభరాశి
కుంభ రాశి వారికి బుధుడు ఐదవ, ఎనిమిదవ ఇంటికి అధిపతి. బుధుడు 6వ ఇంట్లో ఉదయిస్తున్నాడు. దీని కారణంగా కుంభ రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. వ్యక్తిగత జీవితంలోనూ, వృత్తి జీవితంలోనూ మంచి జరుగుతుంది. అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఉపశమనం కలుగుతుంది. ఆర్థిక లాభాలు వస్తాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. శుభ ఫలితాల కోసం శివుడికి నీళ్లతో అభిషేకం చేయండి
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications