Monday vastu tips: సోమవారం ఈ పనులు అస్సలు చేయకండి; శివాగ్రహానికి గురి కాకండి!!

శివుడిని పూజించేవారు సోమవారం నాడు కొన్ని పనులు చేస్తే శుభం జరుగుతుందని, కొన్ని పనులతో ఆశుభం జరుగుతుందని, శివుడికి ఆగ్రహం వస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

హిందూమతంలో ప్రతి రోజుకు ఒక ప్రాధాన్యత ఉంటుంది. ఇక వారంలోని అన్ని రోజులలోనూ ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడిని నిష్టగా ఆరాధించే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. సోమవారం నాడు శివునికి, మంగళవారం ఆంజనేయ స్వామికి, బుధవారం అయ్యప్ప స్వామికి, గురువారం సాయిబాబా కి, శుక్రవారం లక్ష్మీదేవికి, శనివారం వెంకటేశ్వర స్వామి కి పూజలు చేసేవారు ఎంతోమంది ఉన్నారు. ఇక వారంతా ఆయా వారాలలో దేవుళ్ళను పూజించడమే కాదు, చెయ్యకూడని పనులను గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

ముఖ్యంగా హిందూమతంలో సోమవారాన్ని శివుడికి ఇష్టమైన రోజుగా పరిగణిస్తారు. శివుడిని ఆ రోజు శివ భక్తులందరూ ఇష్టంగా పూజించి, ఆయన కటాక్షం వాళ్ళ జీవితాలపై ఉండాలని కోరుకుంటారు. ముఖ్యంగా శివుడిని పూజించేవారు సోమవారం నాడు కొన్ని పనులు చేయకుండా మానుకోవాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. సోమవారం నాడు ధాన్యం కొనుగోలు చేయడం మానుకోవాలని, చదువులకు సంబంధించిన పుస్తకాలు, నోటు పుస్తకాలు, పెన్నులు వంటివి కొనడం సరికాదని చెబుతున్నారు.

Monday vastu tips: Do not do these things on Monday; lord shiva will get angry!!

అంతేకాదు ఆట వస్తువులను, వాహనాలను, ఎలక్ట్రిక్ గాడ్జెట్స్ ను పొరపాటున కూడా సోమవారం నాడు కొనుగోలు చేయకూడదు. సోమవారం నాడు ఈ వస్తువును కొనుగోలు చేయడం ఆశుభమైందిగా పరిగణించబడుతుంది. పొరపాటున సోమవారం నాడు తెలియక ఎవరైనా ఇటువంటి వస్తువులను కొనుగోలు చేస్తే అవి ఎక్కువ కాలం మన్నికగా ఉండవని చెబుతున్నారు. సోమవారం నాడు కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం వల్ల శుభ ఫలితాలు కూడా వస్తాయని చెబుతున్నారు.

ఇంటికి తెల్లటి వస్తువులను తీసుకురావడం వల్ల ఆ ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయని, చెక్కెర, బియ్యం వంటి పదార్ధాలు తెచ్చుకోవచ్చని అంటున్నారు. సోమవారం నాడు తెల్లని వస్త్రాలు ధరించడం వల్ల జాతకంలో చంద్రుడి స్థానం బలోపేతం అవుతుందని, మన జాతక కుండలిలో చంద్రుని బలోపేతం చేయడానికి సోమవారం అనుకూలమైన రోజు అని చెబుతున్నారు. ఇక సోమవారం నాడు తెల్లని వస్తువులను దానం చేయడం వల్ల, తెల్లని వస్తువులను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు. సోమవారం నాడు శివుడిని నిష్టగా అభిషేకించి,పూజించి, శివలింగానికి పాలు సమర్పించడం వల్ల ఆ శివుడి ఆశీర్వాదం తప్పక దొరుకుతుందని చెబుతున్నారు.

Disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+