ఈరోజు అన్ని రాశులవారి ధన జ్యోతిష్యం

వివిధ అంశాలను ఆధారంగా చేసుకొని జ్యోతిష్య పండితులు ఉద్యోగ, వ్యాపారాల్లో ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేస్తుంటారు. గ్రహాలు, నక్షత్రాల గమనాన్ని ఆధారంగా చేసుకొని ఆర్థికంగా జాతకుడి భవిష్యత్తును విశ్లేషిస్తారు. ఈరోజు మార్చి 16వ తేదీన అన్ని రాశులవారి ధన జ్యోతిష్యం ఎలా ఉందో తెలుసుకుందాం.

మేషరాశి
షేర్లతోపాటు బులియన్ మార్కెట్ పై ఆసక్తి వద్దు.. నష్టపోతారు. వ్యాపారానికి సంబంధించిన పనులు మెరుగవుతాయి.

money astrology on march 16th

వృషభరాశి
ఎక్కువ శ్రమతో బిజీగా ఉంటారు. ఉద్యోగంలో ప్రధానమైన బాధ్యతను అందుకుంటారు. దీనివల్ల అభివృద్ధి ఉంటుంది.

మిథునరాశి
తోటి ఉద్యోగుల సూచనలను తీసుకుంటే వ్యాపార విస్తరణకు మంచి అవకాశం కనపడుతుంది. అందరితో కలిసి టీమ్ వర్క్ చేయాలి. పర్సులో వెండి నాణెం పెట్టుకోండి.

కర్కాటకరాశి
వాహనాన్ని లేదంటే భూమిని కొనుగోలు చేస్తారు. తల్లిదండ్రుల నుంచి మద్దతు లభిస్తుంది. సంబంధాలు బలోపేతమవుతాయి.

సింహరాశి
ఆశయం కోసం ప్రయత్నించండి. ఉద్యోగంలో సమస్యలన్నీ అలాగే ఉంటాయి. అదనపు సమయాన్ని కేటాయించండి.

కన్యారాశి
వ్యాపారానికి సంబంధించి సలహాలు, సూచనలు పొందుతారు. కంప్యూటర్, మీడియా వ్యాపారాల్లో అద్భుతమైన ఫలితాలున్నాయి. ప్రభుత్వంలో ఉన్నవారు అధికారిక ప్రయాణం చేస్తారు.

తులారాశి
వ్యాపారానికి సంబంధించిన పనులుంటే వాటిని పూర్తిచేయడానికి ఇది మంచి సమయం. నిరుద్యోగులకు శుభవార్త ఉంది. ఎంతో కృషి చేయాల్సి ఉంటుంది.

వృశ్చిక రాశి
వ్యాపారానికి సంబంధించి మంచి నిర్ణయం తీసుకోవాలి. అంకిత భావంతో పనిచేయాలి. అతిగా ఆలోచిస్తే విజయాలు దక్కవు.

ధనుస్సు రాశి
పని ఒత్తిడి, ఆందోళన తగ్గించుకోవాలి. ఇతరులతో పనిని పంచుకోవాలి. అధికారిక పర్యటనకు సంబంధించిన కాగితాలు చేతికి అందుతాయి.

మకర రాశి
వ్యాపారానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటే అదనపు ఆదాయాన్ని పొందుతారు. కార్యాలయంలో ఆధిపత్యం కొనసాగుతుంది. ప్రాజెక్టుకు సంబంధించిన గొడవలుంటే ముగిసిపోతాయి.

కుంభ రాశి
ఎగుమతి-దిగుమతి వ్యాపారానికి సంబంధించినవారు జాగ్రత్తగా ఉండాలి. కొత్త అవకాశాలు పొందుతారు. చిన్న పొరపాటు జరిగినా కష్టాలు పెరుగుతాయి. పై అధికారుల సహాయం తీసుకుంటే కలిసివస్తుంది.

మీనరాశి
పనిచేసే తీరును మార్చుకోవాలి. వ్యాపారంలో ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది. కొత్త టెక్నాలజీతో మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగులతో ఎటువంటి వివాదాలు వద్దు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+