ఈ మూడు రాశులవారికి డబ్బులవర్షం మొదలైంది.. తేల్చి చెప్పిన బాబా వంగా!
బాబా వంగ బల్గేరియా దేశానికి చెందిన ప్రపంచ ప్రసిద్ధ జ్యోతిష్య శాస్త్ర నిపుణురాలు. బాబా వంగ తన జ్ఞాన దృష్టితో ప్రపంచంలో జరిగే వివిధ సంఘటనలను ముందే ఊహించి చెప్పారు. ఆమె చెప్పిన జోస్యం అనేక సందర్భాలలో నిజమైంది. ఆమె బ్రతికి ఉన్న కాలంలో ఎంతోమంది రాజకీయ ప్రముఖులు ఆమె వద్దకు వెళ్లి భవిష్యత్తు గురించి జ్యోతిష్యం చెప్పించుకునే వారట.
ఈ రాశుల స్టార్ తిరుగుతుంది.. బాబా వంగా జ్యోతిష్య అంచనా
అటువంటి బాబా వంగ 2025 సంవత్సరంలో జూలై నెల నుంచి డిసెంబర్ నెల వరకు ఆరు నెలల కాలంలో ఏ రాశుల వారు అదృష్టవంతులు గా మారుతున్నారు అనేది తన జ్యోతిష్య శాస్త్ర అంచనాలలో వెల్లడించారు. ఇక బాబా వంగ అంచనాల ప్రకారం అదృష్టవంతులు అయిన ఆ రాశుల వారు ఎవరో తెలుసుకుందాం.

కుంభరాశి
కుంభరాశి వారికి శని అధిపతి. 2025సంవత్సరంలో జూలై మాసం నుంచి డిసెంబర్ మాసం వరకు కుంభరాశి జాతకులకు అదృష్టం కలిసివస్తుంది . జూలై 13న శనిగ్రహం సంచారం చేయడం వల్ల వీరి కెరీర్లో పెద్ద మార్పులకు నాంది పలుకుతుంది. దీనికితోడు కుంభరాశిలో రాహువు సంచారం వీరికి ఊహించని ఆర్థిక ప్రయోజనాలను కలిగిస్తుంది. వీరికి ఊహించని విధంగా పాపులారిటీ వస్తుంది. ఈ నెల నుంచి వీరికి తిరుగేలేదని బాబా వంగా వెల్లడించారు.
వృషభరాశి
బాబా వంగా జ్యోతిష్య అంచనాల ప్రకారం వృషభరాశి జాతకులకు కూడా 2025ద్వితీయార్ధం కలిసివస్తుంది. ఈ ద్వితీయార్థంలో వృషభ రాశి వారికి శుక్రగ్రహం చాలా సపోర్ట్ ఇస్తుంది. నిజంగా పడిన కష్టాలకు ఇప్పటినుంచి విముక్తి లభిస్తుంది. మీరు జీవితాన్ని ప్రశాంతంగాను, సుఖంగానూ జీవించటానికి అవకాశం ఉంటుంది. ధనార్జన చేస్తారు. కెరీర్లో బాగా ఎదుగుతారు. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది .లాంగ్ టర్మ్ సెక్యూరిటీ ప్లాన్ చేసుకోవడానికి ఇది వీరికి సరైన సమయం.
సింహరాశి
సూర్యుడు అధిపతిగా ఉన్న సింహరాశి జాతకులు 2025 ద్వితీయార్థంలో శక్తివంతమైన మార్పులను చూస్తారని బాబా వంగా తన జ్యోతిష్య అంచనాలలో వెల్లడించారు. గురుడు, కుజుడు గ్రహాల కలయికతో మీరు గతానికి భిన్నంగా రాణిస్తారని తెలిపారు. కుజుడు వీరికి కావలసిన ఎనర్జీ నుంచి మంచి నిర్ణయాలు తీసుకోవడంలో సహాయకారిగా ఉంటాడు. ఈ సమయంలో వీరికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సింహరాశి వారు తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఇది సరైన సమయం. అయితే నిర్ణయాలు తీసుకునే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని బాబా వంగా సూచించారు.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications