అమలయోగంతో వీరికి కాసుల పంట మొదలెట్టిన చంద్రుడు!!
జ్యోతిష శాస్త్రంలో చంద్రుడికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో కీలకమైన చంద్రగ్రహం శని అధిపతిగా ఉండే రాశి అయిన కుంభరాశిలో ప్రవేశించాడు. అక్టోబర్ 14వ తేదీన కుంభ రాశిలో చంద్రుడు ప్రవేశించడం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. వేద జ్యోతిష్య శాస్త్రంలో అమల యోగం శుభాలను శ్రేయస్సును కలిగించే యోగం.
అమలయోగం
పదవ ఇంటి అధిపతి 9వ ఇంట్లో జన్మ చార్ట్ లో ఉన్నప్పుడు ఇది సంభవిస్తుంది. ఈ అమరిక అనుకూలమైనదిగా పరిగణించబడుతుంది. ఇక ఈ అమల యోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. అమల యోగం వ్యక్తి యొక్క కెరీర్ మరియు అదృష్టానికి మధ్య ఉన్న సంబంధాన్ని హైలైట్ చేస్తుంది. మరి అమల యోగం కారణంగా లబ్ధి పొందే రాశుల గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.

కన్య రాశి
అమల యోగం కారణంగా కన్యారాశి జాతకులకు అదృష్టం తలుపులు తెరుచుకున్నాయి. ఈ సమయంలో కన్యారాశి జాతకులకు ఉద్యోగాలలో పదోన్నతులు కలిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇది విద్యార్థులకు అనుకూలమైన సమయం. కన్యారాశి జాతకులకు ఈ సమయంలో ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి కూడా ఇది మంచి సమయం.
మిధున రాశి
మిధున రాశి వారికి చంద్రుడి కుంభరాశి ప్రవేశం అదృష్టాన్ని ఇస్తుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు లాభాలను ఆర్జిస్తారు. ఆర్థికంగా ఈ సమయంలో బలోపేతం అవుతారు. ఆకస్మిక ధన లాభం కలగడం సంభవిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. పెళ్ళికాని వారి కోసం చేసే వివాహ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. దూర ప్రయాణాలు కూడా లాభాలను కలిగిస్తాయి.
కర్కాటక రాశి
అమల యోగం కారణంగా కర్కాటక రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. చంద్ర గోచారంతో ఈ రాశుల వారికి దశ మారిపోతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి విజయం వరిస్తుంది. కుటుంబ సభ్యులతో జీవితం సంతోషంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. వ్యాపారులు అమితమైన లాభాలను ఆర్జిస్తారు.
కుంభరాశి
కుంభరాశిలోనే చంద్రగోచారం జరుగుతున్న కారణంగా కుంభరాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. కుంభ రాశి జాతకులకు ఈ సమయంలో అదృష్టం కలిసి వస్తుంది. ఇప్పటినుంచి వీరికి మంచి రోజులు మొదలవుతాయి. నూతన ఉద్యోగాలు కోసం ఎదురుచూసే వారికి ఉద్యోగాలు లభిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. పెండింగ్లో ఉన్న అన్ని పనులు పూర్తవుతాయి. ఈ సమయంలో ఏ పని చేపట్టిన విజయాలను ఇస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications