ప్రపంచంలోని సంపన్నులలో ఎక్కువ మంది ఈ రాశిలో పుట్టినవారే!
ప్రపంచంలో ఉన్న కుబేరులు వారి కష్టాన్ని బట్టి కాదు వారి జాతక చక్రాన్ని బట్టి కూడా కుబేరులు అయ్యారన్న విషయాన్ని జ్యోతిష్య శాస్త్రం బలంగా నమ్ముతుంది. మనలో చాలామందికి జ్యోతిష్యం పైన నమ్మకం లేనప్పటికీ జ్యోతిష్యంతో మన జీవితం ముడిపడి ఉందన్న విషయాన్ని చాలామంది అంగీకరిస్తారు. మన జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులు, సమస్యలు కొన్నిటికి గ్రహాల సంచారం కారణమని బలంగా నమ్మేవారు ఉన్నారు.
సంపన్నుల రాశులపై అధ్యయనం
అలాగే కింది స్థాయి నుండి కుబేరులు అయినవారి జీవితంలోనూ జాతక ప్రభావం ఉందని విశ్వసించేవారు లేకపోలేదు. అయితే తాజాగా యూకే లోని లండన్ క్యాష్ ఫ్లోర్ జరిపిన స్టడీలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కుబేరులు ఏ రాశికి చెందినవారు అనేది అధ్యయనం చేశారు. కొన్ని వందల మంది బిలియనీర్లపై జరిపిన స్టడీలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ప్రపంచ కుబేరుల్లో 32 మంది తులా రాశి వారే
ఫోర్స్ బిలియనీర్ 2022 సంపన్నుల జాబితాలో టాప్ 300 బిలినియర్ల పుట్టిన తేదీ సమాచారాన్ని ఉపయోగించి వారి జన్మరాశుల పైన అధ్యయనం చేశాయి. అయితే ఈ అధ్యయనంలో ప్రపంచంలో అత్యధిక కుబేరులు తులా రాశికి చెందినవారుగా ఉన్నట్టుగా తేలింది. సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 23 మధ్య జన్మించిన వారికి కుబేరులయ్య అదృష్టం ఉందని వెల్లడించింది. ప్రపంచ కుబేరులలో 32 మంది తులా రాశి వారని పేర్కొంది.
రాశుల వారీగా సంపన్నుల శాతం
ఇక ఫోర్బ్స్ జాబితాలో ఉన్న ధనవంతుల రాశుల వివరాల్లోకి వెళితే తులా రాశి వారు 12 శాతం మంది సంపన్నులు ఉన్నారని, మీన రాశి వారి 11 శాతం మంది, వృషభ రాశి వారు 10 శాతం మంది, సింహ రాశి వారు తొమ్మిది శాతం మంది, కన్యారాశి వారు 8 శాతం మంది ఉన్నారని పేర్కొంది.
మకరరాశి వారు అత్యల్ప సంపన్నులు
మిధునరాశి వారు 8 శాతం మంది, మేషరాశి వారి 8 శాతం మంది, కుంభరాశి వారు 7.5 శాతం మంది, కర్కాటకరాశి వారు 7.5 శాతం మంది, ధనుస్సురాశి వారు 7.5 శాతం మంది, వృశ్చికరాశి వారు ఆరు శాతం మంది, మకరరాశి వారి 5.5 శాతం మంది సంపన్నులు ఉన్నట్టుగా తేలింది. ఇక ఈ జాబితాలో మకరరాశి వారు చాలా తక్కువగా , కేవలం 15మంది ఉన్నారని వెల్లడించింది.
సంపన్నుల జాబితాలో టాప్ టు పొజిషన్లో మీన రాశి
ఇక సంపన్నుల జాబితాలో తులారాశి తర్వాత టాప్ టు పొజిషన్లో మీన రాశి వారు ఉన్నారని పేర్కొంది. ఇదిలా ఉంటే ఫోర్బ్స్ జాబితా ప్రకారం 2022 టాప్ టెన్ ధనవంతులు వారి రాశుల వివరాల్లోకి వెళితే బెర్నార్డ్ ఆర్నాల్డ్ మీన రాశి వారని, ఎలాన్ మస్క్ కర్కాటక రాశికి చెందిన వారని, జఫ్ బిజోస్ మకర రాశికి చెందిన వారని, వారెన్ బఫెట్ కన్యా రాశికి చెందిన వారని పేర్కొంది.
టాప్ 10 సంపన్నులు వీరే
బిల్ గేట్స్ వృశ్చిక రాశికి చెందిన వారని, ముఖేష్ అంబానీ మేషరాశికి చెందిన వారని, స్టీవ్ బాల్మర్ మేష చెందిన వారని, లారీ పేజ్ మేష రాశికి చెందిన వారనీ, కార్లోస్ స్లిమ్ హెలూ కుంభరాశికి చెందిన వారనీ, లారీ ఎలిసన్ సింహరాశికి చెందిన వారనీ పేర్కొంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications