నాగపంచమి నాడు ఈ పనితో సర్పదోషాలు, రాహు కేతుదోషాలు మాయం.. జీవితంలో సంతోషం!
ప్రతి సంవత్సరం శ్రావణమాసం శుక్లపక్ష పంచమి నాడు నాగ పంచమి పండుగను హిందువులంతా చాలా ఘనంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఆగస్టు 8వ తేదీ రాత్రి 9.56 నిమిషాలకు నాగ పంచమి ఘడియలు ప్రారంభమై ఆగస్టు 9వ తేదీ శుక్రవారం రాత్రి 11.59 నిమిషాల వరకు కొనసాగుతుంది. అయితే సహజంగా హిందూ పంచాంగం ప్రకారం ఉదయం వచ్చిన తిధినే ప్రామాణికంగా తీసుకుంటాం కాబట్టి నాగపంచమిని రేపు అందరూ జరుపుకోనున్నారు.
నాగపంచమి నాడు ఇలా చెయ్యండి
నాగ పంచమి రోజు అనేక శుభయోగాలు ఏర్పడడం వల్ల చాలా రాశుల వారికి శుభ ఫలితాలు వస్తున్నాయి. అయితే గ్రహాల దుష్ప్రభావం ఉన్నవారు, నాగ దోషం ఉన్నవారు నాగపంచమి నాడు కొన్ని చేయవలసిన పనులు చేస్తే వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. కష్టాలు తొలగిపోయి శుభాలు జరుగుతాయి. మరి నాగ పంచమి తేదీనాడు ఏం చేయాలి అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

నాగ పంచమి నాడు నాగదేవత దయ కోసం ఇలా చెయ్యాలి
పంచమి తిధికి సర్పదేవుడు అధిదేవుడు కావడంతో పంచమి తిధి రోజు నాగదేవుడితోపాటు, శివుడిని ప్రత్యేకంగా పూజిస్తారు. ఇక నాగ పంచమి నాడు ఎవరైతే నాగదేవత దయ కావాలని కోరుకుంటారో వారు ఇంటి ముఖద్వారం వద్ద పాము ఆకారాన్ని తయారు చేసి నీళ్లతో అభిషేకం చేసి నెయ్యి సమర్పించాలని చెబుతున్నారు. వీరు పొరపాటున కూడా పాములను కొట్టకూడదని వాటిని సంరక్షించాలని చెబుతారు.
ఈ రోజు చెయ్యాల్సిన పూజలివే
ఇక జ్యోతిష శాస్త్ర దృష్ట్యా కొందరి జీవితంలో రాహు, కేతు దోషాలు ఉంటాయి. రాహు కేతువులను సర్పాలుగా చెబుతారు. అయితే జాతకంలో రాహు కేతు దోషాలు ఉన్నవారు నాగ పంచమి రోజు నాగదేవతను పూజించటం వల్ల నాగదోషంతోపాటు, గ్రహాల దుష్ప్రభావం కూడా తగ్గుతుంది. ఈరోజు కాలసర్ప పూజ, మహా మృత్యుంజయ పూజ, రుద్రాభిషేకం చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందని నాగదేవత వీరిపైన తన కటాక్షాన్ని చూపిస్తుందని చెబుతారు.
రాశిని బట్టి నాగపంచమి నాడు ఈ చెట్లు నాటాలి
అంతేకాదు ప్రతి వ్యక్తి నాగపంచమి రోజున తన రాశిని, లగ్నాన్ని బట్టి ఒక చెట్టుని నాటాలని,ఇది వారి జీవితంలోని దోషాలను తొలగించి సంతోషాన్ని, శ్రేయస్సును ఇస్తుందని చెబుతున్నారు. నాగ పంచమి నాడు మేషరాశి వారు వేప చెట్టును, వృషభరాశివారు మామిడి చెట్టును, మిధునరాశి వారు మామిడి లేదా రావి చెట్లను, కర్కాటకరాశి వారు వేప లేదా మర్రి చెట్టును, సింహరాశి వారు వేపా లేదా మామిడి చెట్టును పెట్టాలని చెబుతున్నారు.
నాగ దోషం నుండి, గ్రహదోషాల నుండి విముక్తికి చెట్లు నాటాలి
ఇక కన్యారాశి వారు మామిడి చెట్టును, తులా రాశి వారు వేపచెట్టు లేదా శమీ వృక్షాన్ని, వృశ్చిక రాశి వారు వేప చెట్టును లేదా రావి చెట్టును, ధనుస్సు రాశి వారు మామిడి చెట్టును లేదా రావి చెట్టును, మకర రాశి వారు శమీచెట్టును, కుంభ రాశి వారు మర్రిచెట్టును లేదా శమీ చెట్టును, మీన రాశి వారు రావి లేదా మామిడి లేదా వేప చెట్టును పెట్టాలని చెబుతున్నారు. ఇలా చేస్తే నాగ దోషం నుండి, గ్రహదోషాల నుండి విముక్తి లభిస్తుందని సూచిస్తున్నారు.
-
శ్రీరామనవమి నాడు రెండు విశేషయోగాలు.. వీరికి ఊహించని ధనలాభం! -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
ఏప్రిల్ లో బుధ గోచారంతో ఈ రాశులవారికి గడ్డుకాలం! -
today rashiphalalu:మీనరాశిలో ఆ గ్రహాల కూటమి.. మీకే సంపదల వెల్లువ! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..!












Click it and Unblock the Notifications