500ఏళ్ళ తర్వాత నవపంచమ రాజయోగంతో ఈ రాశులవారి స్టార్ తిరిగింది.. మీరున్నారా!!

వేద జ్యోతిష్య శాష్ట్రంలో గ్రహాల సంచారం వివిధ రాశుల వారి జాతకాలను నిర్దేశించటం మాత్రమే కాదు అనేక యోగాలకు కారణం అవుతాయి. గ్రహాల సంచారం కారణంగా అనేక శుభ, అశుభ పరిణామాలు వివిధ రాశుల వారి జీవితాలలో చోటు చేసుకుంటాయి. గ్రహాలూ ఒకే రాశిలోకి రావటం, ఎదురెదురు పడటం, త్రిభుజాకారంలో తారసపడటం వంటి అనేక ఖగోళ ద్రుగ్విషయాలు కొన్ని యోగాలను ఏర్పరుస్తాయి.

అలా ఏర్పడిన యోగాలలో కొన్ని శుభాలను ఇచ్చే రాజయోగాలు కాగా కొన్ని ఆశుభాలను ఇచ్చే యోగాలు కూడా ఉంటాయి. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవ పంచమ రాజయోగం చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ రాజయోగం ధనుస్సు రాశిలో 500సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏర్పడింది. బుధుడు, బృహస్పతి కలిసి ధనుస్సు రాశిలో నవ పంచమ మరియు కేంద్ర త్రికోణ రాజయోగాన్ని సృష్టిస్తున్నారు.

navpancham rajayoga for three zodiac signs; super luck with kubera blessings

అయితే ఈ నవ పంచమ రాజయోగం ముఖ్యంగా మూడు రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వారి పంట పండినట్టే అని చెప్తున్నారు. మిధున రాశి వారికి నవ పంచమ రాజయోగం చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో మిధున రాశి వారు అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. పెట్టుబడుల నుండి లాభాలు ఆర్జించటానికి ఇదే సరైన సమయం.

ఈ సమయంలో మిధున రాశి వారి గౌరవ ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. వివిధ వ్యాపార ఒప్పందాలు చాలా లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగస్తులు కూడా ఇంక్రిమెంట్ లను ఆశించవచ్చు. మిధునరాశి వారి వైవాహిక జీవితం ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపార విస్తరణకు ఇది సరైన సమయం .

కన్యా రాశి వారికి నవ పంచమ రాజయోగం కలిసొస్తుంది. ఈ రాజయోగంతో కన్యా రాశి జాతకులు కెరీర్ లో అన్ని విజయాలను సాధిస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. పని చేసే చోట తగిన గుర్తింపు లభిస్తుంది. శ్రమకు తగ్గ ఫలితం దక్కే చాన్స్ ఉంది. ఈ సమయంలో సంపాదన సంతృప్తికరంగా ఉంటుంది. కన్యా రాశి వారి ఆరోగ్యం చెక్కు చెదరకుండా ఉంటుంది.

ధనుస్సు రాశి వారికి నవ పంచమ రాజయోగం లబ్ధిని చేకూరుస్తుంది. ఇది చాలా శుభ ఫలితాలను తెస్తుంది. ఆస్తి లేదా భూముల మీద పెట్టుబడులు మీకు చాలా ప్రయోజనాలను ఇస్తాయి. వ్యాపారస్తులు లాభాలు పొందేందుకు ఇది సరైన సమయం. ఈ సమయంలో ధనుస్సు రాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అనుబంధం మరింత ధృడపడుతుంది. ఆర్ధికంగా బాగా లాభదాయకంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది.

ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+