త్వరలో నవ పంచమ రాజయోగం ఇస్తుంది వీరికి అఖండ ధనయోగం!
సృష్టిలో గ్రహాల సంచారం వివిధ రాశులలో, వివిధ నక్షత్రాలలో నిర్దిష్ట సమయంలో జరుగుతూ ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని గ్రహాల సంచారానికి చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. గ్రహాలు సంచారమే అన్ని రాశుల వారి జీవితాలను మార్చేస్తుంది. ఇక డిసెంబర్ 20వ తేదీన త్వరలో గురు శుక్ర గ్రహాల కలయిక జరగబోతుంది. గురు శుక్ర గ్రహాల కలయిక కారణంగా నవ పంచమ రాజయోగం ఏర్పడుతోంది.
నవ పంచమ రాజయోగం
జ్యోతిష్య శాస్త్రపరంగా ఈ యోగాన్ని చాలా శక్తివంతమైన యోగంగా భావిస్తారు. నవ పంచమ రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. గురు శుక్ర గ్రహాలు తొమ్మిదవ మరియు ఐదవ గ్రహాల అధిపతులుగా ఒకదానికొకటి నిర్దిష్ట గృహాలలో ఉన్నప్పుడు నవ పంచమ రాజయోగం ఏర్పడుతుంది. దీని కారణంగా ముఖ్యంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ రాశులు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

వృషభ రాశి
నవ పంచమ రాజయోగం కారణంగా వృషభ రాశి జాతకులకు డిసెంబర్ 20వ తేదీ నుంచి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. గతం కంటే భిన్నంగా ఈసారి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ఆర్థికంగా పక్కవారికి సహాయం చేసే పరిస్థితి వృషభ రాశి జాతకులకు వస్తుంది. సమాజంలో వృషభ రాశి వారికి కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయి.
మేష రాశి
నవ పంచమ రాజయోగం కారణంగా మేషరాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాలలో గణనీయమైన పురోగతి కలుగుతుంది. మానసిక ఆందోళన తగ్గి కొత్త ఉపాధి మార్గాలు కనిపిస్తాయి. ఈ సమయం మేష రాశి జాతకులకు అదృష్ట సమయంగా చెప్పవచ్చు.
తులారాశి
తులారాశి వారికి నవ పంచమ రాజయోగం కారణంగా అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. పెట్టిన పెట్టుబడులు విపరీతమైన లాభాలను ఇస్తాయి. వర్తక, వ్యాపారాలు చేసే వారికి ఈ సమయంలో కలిసి వస్తుంది. ఇది తులా రాశి జాతకులకు అదృష్టాన్ని ఇచ్చే సమయం.
ధనుస్సు రాశి
నవ పంచమ రాజయోగం కారణంగా ధనుస్సు రాశి వారికి విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ సమయంలో ధనుస్సు రాశి వారికి అనుకున్న పనుల్లో విజయాలు కలుగుతాయి. ధనుస్సు రాశి వారి ప్రేమ జీవితం కూడా సానుకూలంగా మారుతుంది. ఇది ధనుస్సు రాశి వారికి అన్ని విధాలుగా సత్ఫలితాలను ఇస్తుంది.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications