త్వరలో నవపంచమ రాజయోగం ఇస్తుంది వీరికి కుబేర యోగం!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంయోగం కారణంగా అనేక యోగాలు ఏర్పడతాయి. అయితే ఏప్రిల్ నెలలో గ్రహాలు సంయోగం కారణంగా బుధాదిత్య రాజయోగం, శుక్రాదిత్య రాజ యోగం, పంచ గ్రాహి యోగం, గజకేసరి రాజయోగం, గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతున్నాయి. అయితే ఇదే ఏప్రిల్ నెలలో అత్యంత అరుదైన నవ పంచమ రాజయోగం కూడా ఏర్పడుతుంది.
నవ పంచమ రాజయోగం
ఏప్రిల్ 20వ తేదీన తెల్లవారుజామున 4.20 నిమిషాలకు వరుణుడు, కుజుడు మధ్య 120 డిగ్రీల దూరం ఏర్పడి నవపంచమ రాజయోగం ఏర్పడుతుంది. వరుణుడు సహజంగా ఒక్కొక్క రాశిలో 14 సంవత్సరాల పాటు ఉంటాడు. ప్రస్తుతం వరుణుడు మీనరాశిలో ఉన్నాడు. మీనరాశిలో ఉన్న వరుణుడికి కుజుడికి మధ్య 120 డిగ్రీల దూరం ఏర్పడడంతో ఏర్పడిన నవ పంచమ రాజయోగం కొన్ని రాశులవారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి నవ పంచమ రాజయోగం తో అదృష్టం కలిసి వస్తుంది. కర్కాటక రాశి జాతకులు అన్ని రంగాలలో విజయం సాధించడమే కాకుండా ఆర్థిక లాభాలను కూడా పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. కర్కాటక రాశి వారికి ఉద్యోగాలలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలు ఈ సమయంలో తెరుచుకుంటాయి.
తులారాశి
తులా రాశి వారికి నవ పంచమ రాజయోగం కారణంగా శుభాలు చేకూరుతాయి. ఈ రాజయోగం తులా రాశి వారి ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. తులా రాశి వారికి నవ పంచమ యోగం మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసొస్తుంది. ఉద్యోగంలోనూ నూతన అవకాశాలకు ఆస్కారం ఉంటుంది. తులారాశి వారు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.
కన్యారాశి
నవ పంచమ రాజయోగం కన్యా రాశి వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఈ సమయంలో మీరు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. కెరీర్లో పురోగతి ఉంటుంది. పూర్వీకుల నుండి ఆస్తులు వచ్చే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో సంతోషంగా జీవిస్తారు. కోర్టు అధికారిక వ్యవహారాలలో విజయాలు సాధించే అవకాశం ఉంది . ఇది కన్యా రాశి వారికి శుభ సమయం.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications