కేతువు సంచారం.. ఈ రాశులకు అద్భుత ధనయోగం

ఒక రాశి నుంచి మరో రాశికి మారేందుకు కేతువు 18 నెలల సమయం తీసుకుంటాడు. గత సంవత్సరం అక్టోబరులో కన్యారాశిలోకి ప్రవేశించిన కేతువు 2025 ఏప్రిల్ వరకు అక్కడే ఉంటాడు. దీనివల్ల రాబోయే ఎనిమిది నెలలు కొన్ని రాశులవారికి ఇబ్బందులు కలగనున్నాయి.

మరో రెండు రాశులవారికి మాత్రం అద్భుతమైన ప్రయోజనాలను అందించనున్నాడు. ఒకరకంగా వారికి కేతువు వరాలు కురిపిస్తాడు. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ముందుగా నష్టపోయే రాశుల వివరాలు, తర్వాత లాభపడే రాశుల వివరాలను తెలుసుకుందాం.

next eight months will cause difficulties for some zodiac signs

కర్కాటక రాశి
వ్యక్తిగత జీవితంలో సమస్యలు వస్తాయి. మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పెద్దవారి ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో విభేదాలు తలెత్తుతాయి. మానసికంగా కుంగిపోతారు.

తులా రాశి
రాబోయే ఎనిమిది నెలలు వీరికి చాలా కష్టం. పనిచేసేచోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. పై అధికారుల నుంచి సహకారం అందదు. తోటి ఉద్యోగులవల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. లావాదేవీల విషయంలో జాగ్రత్త అవసరం.

వృషభ రాశి
ఖర్చులు పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య ఒడిదుడుకులు చోటుచేసుకుంటాయి. వీరిద్దరి మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకుంటాయి. అనవసర కలహాలకు దూరంగా ఉండటం మంచిది. ఇతరులతో మాట్లాడే సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి.

రెండు రాశులవారికి కేతువు వరాలు ప్రకటిస్తాడు. అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాడు. ఆ రాశుల వివరాలు తెలుసుకుందాం.

మేష రాశి
ఊహించనిరీతిలో డబ్బు అందుకుంటారు. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. దీర్ఘకాలికంగా రాబడినిచ్చే వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకుంటారు. కెరీర్ పరంగా మంచిస్థాయికి చేరుకుంటారు.

వృశ్చిక రాశి
అద్భుతమైన లాభాలను చవిచూస్తారు. పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ధనలాభం ఉంది. అయితే ఖర్చులు తగ్గించుకోవాలి. ఒత్తిడిని తగ్గించుకోవడంవల్ల ప్రశాంతమైన జీవితం లభిస్తుంది. తోబుట్టువులతో వివాదాలు పరిష్కారమవుతాయి. విహార యాత్రలకు వెళతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+