మే31 నిర్జల ఏకాదశి; ఆరోజు పొరబాటున కూడా తులసిమొక్క దగ్గర ఈ తప్పులు చెయ్యొద్దు!!
హిందూమతంలో ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఏకాదశిని హిందువులు పరమ పవిత్రమైన దినంగా భావిస్తారు . ప్రతినెలలోనూ రెండు ఏకాదశులు వస్తాయి. ఒకటి శుక్ల పక్షంలో, రెండవది కృష్ణ పక్షంలో వస్తాయి. అయితే జేష్ఠ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు. ఈ సంవత్సరం నిర్జల ఏకాదశి మే 31వ తేదీన వస్తుంది.
నిర్జల ఏకాదశి రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సకల పాపాలు తొలగిపోయి కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు. ఇక నిర్జల ఏకాదశి రోజు పొరపాటున కూడా లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన తులసి మొక్క వద్ద ఎటువంటి తప్పులు చేయకూడదు అని చెబుతారు.హిందువులు లక్ష్మీదేవి తులసి చెట్టు లో నివసిస్తున్నదని నమ్ముతారు.

అంతేకాదు లక్ష్మీదేవి ఏకాదశి నాడు ఉపవాసం చేస్తుందని చెబుతారు. అందుకే ఈ రోజు తులసి మొక్కకు నీళ్లు పోయకూడదు. ఏకాదశి రోజున తులసి ఆకులను ఎప్పుడు తుంచకూడదు. తులసి ఆకులు ఎప్పుడు అవసరమైనా ఏకాదశి రోజు కాకుండా అంతకు ముందు రోజు మాత్రమే తెంచి పెట్టుకోవాలి. తులసి ఆకులను గోళ్లతో గిల్లడం మహా పాపం. తులసి ఆకులు తుంచడానికి ముందు తులసి మొక్కకు నమస్కరించి మరీ తుంచాలి.
మురికి చేతులతో లేదా మైల పడిన శరీరంతో తులసి ఆకులను ఎప్పుడు తాకకూడదు. ఒక వేళ అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది. లక్ష్మీ దేవికి కోపం వస్తే ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులను కలిగిస్తుంది. ఆ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది. నిర్జల ఏకాదశి నాడు తులసి మొక్క ఉన్న చోట మురికి ఉండకుండా చూసుకోవాలి.
పొరపాటున కూడా తులసి మొక్క ఉన్న ప్రాంతంలో చెప్పులు, బూట్లు విప్పకుండా చూసుకోవాలి. లక్ష్మీదేవికి అత్యంత ఇష్టంగా, పరమపవిత్రంగా భావించే తులసి మొక్కను ఆ రోజు మంచి భక్తి ప్రపత్తులతో పూజిస్తే లక్ష్మీదేవి కరుణిస్తుంది. అందుకే నిర్జల ఏకాదశి రోజు తులసి మొక్క విషయంలో పైన పేర్కొన్న జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications