విశేషమైన గ్రహ బలం ఉంది.. సంపదలు పెరుగుతాయి

గ్రహాలు ఒక రాశి నుంచి మరో రాశిలో నిర్ధేశిత సమయంలో ప్రయాణిస్తుంటాయి. ఇలా ప్రయాణించడంవల్ల కొన్ని రాశులకు శుభ ఫలితాలు కలిగితే మరికొన్ని రాశులకు అశుభ ఫలితాలు కలుగుతాయి. ఈనెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, కుటుంబ పరంగా ఎటువంటి ఫలితాలు ఉంటాయి? ఎలా కలిసివస్తుంది? ప్రతికూలత ఉంటే వాటిని అధిగమించడానికి ఏం చేయాలి? ఎటువంటి పరిహారాలుంటాయి? అనే విషయాలను తెలుసుకుందాం.

తులా రాశి
మనోబలంతో పనులు చేయాలి. వ్యాపార యోగం ఉంది. అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలు ఉండాలి. ఎక్కడా వెనకడుగు వేయవద్దు. ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి. వారం మధ్యలో ఒక పనిలో విజయం వరిస్తుంది. శివుణ్ని ఆరాధించడంవల్ల మేలు కలుగుతుంది.

november 12th to 18th weekly horoscope

వృశ్చిక రాశి
ఆర్థికంగా మంచి ఫలితం ఉంటుంది. ఏకాదశంలో శుక్రుడి సంచారంవల్ల ధనంతోపాటు ధాన్యాభివృద్ధి ఉంది. సంపదలు పెరుగుతాయి. మితంగా మాట్లాడుతుండాలి. ప్రారంభించిన పనులు మధ్యలో ఆపొద్దు. ఇష్టదైవాన్ని స్మరించాలి.

ధనుస్సు రాశి
గ్రహబలం విశేషంగా ఉంది. చిన్న చిన్న ప్రయత్నాలతోనే అదృష్టవంతులవుతారు. గతంలో చేసిన పనులకు సంబంధించిన ఫలితం ఇప్పుడు వస్తుంది. గొప్ప భవిష్యత్తు ఉంది. కాకపోతే మీకోసం మీరు గట్టిగా పనిచేయాలి. నూతనంగా పనులు చేపట్టేందుకు మంచి సమయం. లక్ష్మీదేవిని దర్శించడంవల్ల శుభవార్తను వింటారు.

మకర రాశి
మంచిరోజులు ప్రారంభమయ్యాయి. అవకాశాన్ని వినియోగించుకోవాలి. కొత్తగా చేసే ప్రయత్నాలు సఫలమవుతాయి. విఘ్నాలు ఉండవు. ఉద్యోగంలో కోరుకున్నది దక్కుతుంది. న్యాయపరమైన విజయం లభిస్తుంది. మిత్రబలం శక్తినివ్వడంతోపాటు సంపదలు పెరుగుతాయి. లక్ష్మీదేవిన ధ్యానించాలి.

కుంభరాశి
ఆర్థికంగా అభివృద్ధి ఉంది. ధనధాన్యాది లాభాలున్నాయి. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా చూసుకోవాలి. ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. గ్రహ దోషం వెంటాడుతుంది. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. నవగ్రహ శ్లోకాలు పఠించాలి.

మీనరాశి
కాలం అనుకూలంగా లేదు. దృఢసంకల్పంతో పనులు చేస్తుండాలి. చంచలత్వం లేకుండా చూసుకోవాలి. వారం మధ్యలో విజయం ఉంది. ఇంట్లోవారితో విభేదించవద్దు. అపార్థాలకు తావివ్వొద్దు. ఇష్టదైవాన్ని స్మరించాలి. ఆపద నుంచి బయటపడతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+