సూర్య గ్రహణం రోజు ఏం చేయాలంటే..
ఈ సంవత్సరం ఇప్పటికే సూర్య, చంద్రగ్రహణాలు సంభవించాయి. ఈ ఏడాది రెండో (చివరి) సూర్యగ్రహణం అక్టోబరు 14వ తేదీ శనివారంనాడు ఏర్పడనుంది. ఈ గ్రహణం ఉదయం 08:34 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2:25 గంటలకు ముగియనుంది. ఇది భారతదేశంలో కనిపించదు. సూతక్ కాలం కూడా చెల్లదు. సూర్యగ్రహణం మెుత్తం 12 రాశులవారిని ప్రభావితం చేయనుండగా, కొన్ని రాశులవారికి అనుకూలంగా, మరికొన్ని రాశులవారికి ప్రతికూలంగా ఉంటుంది.
సూర్యుడు, భూమికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇప్పడు ఏర్పడబోయేది కంకణాకార సూర్యగ్రహణం. చంద్రుడు సూర్యుడిని పూర్తిగా కవర్ చేయడు. సూర్యుని బయటి భాగం కంకణంలా కనిపిస్తుంది. ఈ రెండో సూర్యగ్రహణం ఉత్తర అమెరికా, కెనడా, గ్వాటెమాల, మెక్సికో, అర్జెంటీనా, కొలంబియా, క్యూబా, బార్బడోస్, పెరూ, ఉరుగ్వే, ఆంటిగ్వా తదితర దేశాల్లో కనిపిస్తుంది.

ఈ గ్రహణం మనదేశంలో కనిపించదు కాబట్టి సూతక్ కాలం ఉండదు. సుతక్ కాలం సమయంలో ఎలాంటి పూజలు కానీ, శుభ కార్యాలు కానీ జరగవు. దేవాలయాలను మూసేస్తారు. గ్రహణ సమయంలో తినడం, తాగడం వంటి పనులు చేయకూడదు. పుట్టబోయే పిల్లలపై చెడు ప్రభావం పడకుండా ఉండేందుకు గర్భిణులు ఇంట్లోనే ఉండాలి.
ఈ ఏడాదిలో మొత్తం నాలుగు గ్రహణాల్లో ఇప్పటికి రెండు పూర్తయ్యాయి. మిగిలిన సూర్యగ్రహణం, చంద్ర గ్రహణాల్లో ఒకటైన చంద్ర గ్రహణం కొద్దిరోజుల్లోనే సంభవించనుంది. 2023లో ఇండియాలో కన్పించే ఏకైక గ్రహణం ఇదే. దీని ప్రభావం గట్టిగా ఉంటుంది. సూతకకాలం కూడా వర్తిస్తుంది. సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం.. రెండూ అక్టోబరు నెలలోనే రానున్నాయి. అక్టోబరు 14వ తేదీన సూర్య గ్రహణం, 28వ తేదీన చంద్ర గ్రహణం ఏర్పడనుంది.












Click it and Unblock the Notifications