ఈనెల 20న కర్వాచౌత్.. ఈ రాశులకు అఖండ రాజయోగం

ఈ నెల 20వ తేదీన కర్వాచౌత్ పండగ జరుపుకుంటాం. జ్యోతిష్యం ప్రకారం ఆరోజు బుధాదిత్య రాజయోగం, మహాలక్ష్మీ యోగం, శష్ రాజయోగం, సమాసప్తక యోగం, గజకేసరి యోగాలు ఏర్పడుతున్నాయి. చంద్రుడు, కుజుడు కలిసి మిథునరాశిలో గజకేసరి, కుంభరాశిలో శనిదేవుడు శష్, తులారాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు కలిసి బుధాదిత్య రాజయోగాలను ఏర్పరుస్తున్నాయి. వీటివల్ల కొన్ని రాశులకు అత్యధిక ప్రయోజనాలు దక్కుతున్నాయి. ఆర్థికంగా మంచి లాభాలున్నాయి. ఆ రాశుల వివరాలను తెలుసుకుందాం.

తులా రాశి
విద్యార్థులకు చదువుపై మంచి ఏకాగ్రత కుదురుతుంది. భవిష్యత్తు కోసం తీసుకునే నిర్ణయాలు మంచి ప్రయోజనాలనిస్తాయి. మేథస్సు వల్ల మంచి నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగులకు వారి కార్యాలయంలో ఇతర ఉద్యోగుల నుంచి, పై అధికారుల నుంచి మద్దతు లభించి మంచి పేరు తెచ్చుకుంటారు. కుటుంబ సభ్యులతో సమయాన్ని వెచ్చిస్తారు.

On 20th of this month 5 zodiac signs will get financial benefits due to the formation of five royal yogas

ధనస్సు రాశి
ఆర్థికంగా పటిష్ట స్థితికి చేరుకుంటారు. అదనపు ఆదాయానికి మార్గాలు తోడవుతాయి. కుటుంబ జీవితం చాలా బాగుంటుంది. పెద్దల నుంచి దీవెనలు అందుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి.

వృషభ రాశి
కొత్తగా వాహనాన్ని లేదంటే స్థలాన్ని కొనుగోలు చేస్తారు. అన్ని రంగాల్లో విజయం దక్కుతుంది. బుధుడు, శుక్రుడు, శని వీరిని ప్రత్యేకంగా ఆశీర్వదిస్తారు. మంచి లాభాలను ఆర్జిస్తారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులను పూర్తిచేస్తారు. ఆరోగ్యం చాలా బాగుంటుంది. పిల్లల నుంచి శుభవార్తలు వస్తాయి.

కన్యారాశి
కొంతకాలం నుంచి వేధిస్తున్న ఆర్థిక సంక్షోభాల నుంచి బయటపడతారు. ప్రభుత్వ ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. పెద్దల నుంచి దీవెనలు అందుతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. దాంపత్య జీవితం బాగుంటుంది. కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. పెళ్లికానివారికి పెళ్లి ప్రతిపాదనలు వస్తాయి.

కుంభ రాశి
సంపద పెరుగుతుంది. పెట్టుబడి పెట్టేవారికి మంచి రాబడి వస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. మంచి ఫలితాలను పనితీరులో రాబడతారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+