Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మహా శివరాత్రి నాడు శివయ్య కటాక్షం ఈ రాశులవారిపై తధ్యం!

ఫిబ్రవరి 15, 2026న ముఖ్య గ్రహాల సంచారం అన్ని రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. నేడు మహా శివరాత్రి పర్వదినం కూడా.. నేడు సూర్యుడు కుంభ రాశిలో సంచరిస్తూ సమాజం, నాయకత్వం మరియు కొత్త ఆలోచనలపై ప్రభావం చూపుతాడు.చంద్రుడు రాశి మార్పు చేసే అవకాశముంది. బుధుడు కమ్యూనికేషన్, వ్యాపార లావాదేవీలపై ప్రభావం చూపుతాడు. మాటలలో జాగ్రత్త అవసరం. శుక్రుడు ఆర్థిక, సంబంధాల విషయాల్లో అనుకూల ఫలితాలు ఇవ్వగలడు.

మహా శివరాత్రి నాడు గ్రహాల సంచారం.. రాశి ఫలాలు

కుజుడు ధైర్యం పెంచుతాడు కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. గురుడు శుభప్రభావంతో అభివృద్ధి అవకాశాలు కలిగించగా, శని క్రమశిక్షణ, బాధ్యతలపై దృష్టి పెట్టేలా చేస్తాడు. రాహు-కేతు అకస్మిక పరిణామాలకు కారణమవవచ్చు. ఇక నేడు శివరాత్రి నాడు గ్రహాల సంచారం కారణంగా కలిసివచ్చే ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం .

On Maha Shivratri the grace of Lord Shiva is directed towards those of these zodiac signs know this

మేషరాశి

శివరాత్రి వేళ మేషరాశి జాతకులకు ఈ రోజు పనుల్లో చురుకుదనం ఉంటుంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. మేషరాశి వారికి ఖర్చుల్లో జాగ్రత్త అవసరం.

వృషభరాశి

వృషభ రాశి వారికి శివరాత్రి వేళ ఆర్థికంగా లాభ సూచనలు ఉన్నాయి. కుటుంబ సహకారం లభిస్తుంది. నేడు వీరికి ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది.

మిధున రాశి

శివరాత్రి వేళ మిథున రాశి జాతకుల నిర్ణయాల్లో ఆలోచన అవసరం. మిధునరాశి వారి స్నేహితులతో చర్చలు ప్రయోజనకరంగా ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త పాటించాలి.

కర్కాటక రాశి

శివరాత్రి వేళ కర్కాటక రాశి జాతకులు శుభ వార్తలు వినే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. వీరికి నేడు పనులు సాఫీగా పూర్తవుతాయి.

సింహరాశి

సింహ రాశి జాతకులకు శివరాత్రి వేళ ఉద్యోగంలో గుర్తింపు లభిస్తుంది. ఉన్నతాధికారుల మద్దతు ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గించాలి.

కన్యా రాశి

కన్య రాశి వారికి శివయ్య అనుగ్రహంతో వ్యాపారంలో పురోగతి ఉంటుంది. పాత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది.

తులారాశి

తుల రాశి జాతకులకు భాగస్వామ్య వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. ధనలాభం సాధ్యం అవుతుంది.

వృశ్చిక రాశి

శివరాత్రి వేళ వృశ్చిక రాశి వారు కొత్త పనులకు శ్రీకారం చుడుతారు. కుటుంబ మద్దతు లభిస్తుంది. నేడు వీరికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి నేడు అనుకోని ఖర్చులు ఉంటాయి. సహనంతో వ్యవహరిస్తే సమస్యలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం.

మకర రాశి

మకర రాశి వారు శివరాత్రి వేళ ఉద్యోగ మార్పులపై ఆలోచనలు చేసే అవకాశం ఉంది. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది.

కుంభ రాశి

కుంభ రాశి జాతకులకు శివరాత్రి వేళ కొత్త పరిచయాలు కలుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం.

మీనరాశి

శివరాత్రి వేళ మీన రాశి జాతకులు శుభ ఫలితాలు పొందుతారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఆర్థిక లాభం సూచిస్తుంది.

గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు. వ్యక్తిగత జాతకాలను బట్టి ఫలితాలు మారవచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+