జూన్ 2న పరిఘ యోగం; ఈ రాశుల వారికి రేపు కష్టాలు, నష్టాలు.. జాగ్రత్త!!

నవగ్రహాల సంచారం వల్ల కలిగే యోగాలు కొన్ని శుభ యోగాలుగానూ, కొన్ని అశుభ యోగాలుగానూ ఉంటాయి. శుభ యోగాల సమయంలో ఏ పని చేసినా నిర్విఘ్నంగా సాగుతాయి. అన్ని పనులలోను విజయం చేకూరుతుంది. అశుభ యోగాలు ఉన్న సమయంలో ఎటువంటి పని సక్సెస్ కాదు. అన్నింటా చిరాకులు, ఇబ్బందులు కనిపిస్తాయి. జూన్ నెలలో కొన్ని శుభ యోగాలు, కొన్ని అశుభ యోగాలు ఏర్పడనున్నాయి.

జూన్ 2వ తేదీన రేపు పరిఘ యోగం ఏర్పడనుంది. మొత్తం 27 యోగాలలో పరిఘ యోగం 19వ యోగం. ఇది జీవితములో చిరాకులను కలిగించే, బాధలను తీసుకువచ్చే యోగం. ఇది మన రోజువారి పనులలో అడ్డంకులను తీసుకువచ్చే యోగం. పరిఘ అంటే మూసివేయడం. ఇది మన అవకాశాలను మూసివేసి మనకు ఇబ్బందులను తీసుకువస్తుంది. పరిఘ యోగం నిర్బంధాన్ని, నిస్పృహను తెస్తుంది.

Parigha Yoga on June 2; These zodiac signs will face difficulties and losses tomorrow

పరిఘ యోగం నాడు ఏ పని ప్రారంభించడం మంచిది కాదు. ఇది శుభ కార్యాలను నిర్వహించడానికి పనికొచ్చే ముహూర్తం కాదు. పరిఘ యోగంలో జన్మించిన వ్యక్తులు నిరాశ, నిస్పృహలను కలిగి ఉంటారు. ఈ యోగంలో జన్మించిన వారు తెలివి గల వారిగా, పరిజ్ఞానం ఉన్నవారిగా ఉన్నప్పటికీ వారి జీవితంలో నిరాశ, ఒంటరితనం కనిపిస్తాయి.

పరిఘ యోగానికి శని అధిపతి. ఇక రేపు రానున్న పరిఘ యోగంతో మేష, సింహ, ధనుస్సు, మకర రాశి జాతకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మేష రాశి జాతకులను పరిఘ యోగం నిరాశ, నిస్పృహలకు గురి చేస్తుంది. రోజువారి చేసే పనిలో కూడా ఇబ్బందులను అనుభూతి చెందుతారు. పని చేయలేక వారు డిప్రెషన్ కు గురవుతారు.

సింహ రాశి జాతకులు పరిఘ యోగం కారణంగా కోపం మరియు చిరాకులను అనుభవిస్తారు. కోపం కారణంగా వారు కొత్త సమస్యలలో ఇరుక్కునే అవకాశం ఉంది. భాగస్వాములతో గొడవలు అయ్యే ప్రమాదం ఉంది. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉండదు. అనేక సమస్యలను సింహ రాశి జాతకులు అనుభవించాల్సి వస్తుంది.

రేపు పరిఘ యోగం కారణంగా మకర రాశి జాతకులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. వారికి కావలసిన భావోద్వేగ, మానసిక, ఆర్థిక మద్దతు లభించకపోవచ్చు. అది వారి ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. ధనుస్సు రాశి జాతకులు పరిఘ యోగం కారణంగా చెప్పుకోలేని విచారానికి గురవుతారు. ఏపని అనుకున్నట్టుగా జరగకపోగా, అన్ని పనుల్లోనూ ఆలస్యం ఇబ్బంది పెడుతుంది. కనుక ఈ 4 రాశుల వారు రేపు జాగ్రత్తగా ఉండాలని సూచించబడింది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+