శక్తివంతమైన పరివర్తిని ఏకాదశి.. నేటినుండి ఈ రాశులవారికి జాక్ పాట్!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనానికి, గ్రహాల సంయోగానికి ఏ విధంగా అయితే ప్రాధాన్యత ఉంటుందో, అదేవిధంగా తిధులు, వారాలు, నక్షత్రాలు కూడా ప్రాధాన్యత ఉంటుంది. నేడు పరివర్తిని ఏకాదశి. శ్రీమహావిష్ణువుకి అత్యంత ఇష్టమైన రోజు. ఈ రోజున శ్రీమహావిష్ణువుకు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజ చేసి నెయ్యి దీపం పెట్టి ఉపవాసం ఉన్నవారు అన్ని సమస్యల నుంచి బయటపడతారు.
పరివర్తిని ఏకాదశి ... అదృష్ట రాశులు
పరివర్తిని ఏకాదశి నాడు ముఖ్య గ్రహాల సంచారం కారణంగా కొన్ని శుభ యోగాలు ఏర్పడుతున్నాయి . ఈ శుభ యోగాలు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తున్నాయి. ఇక పరివర్తిని ఏకాదశి నుండి కొన్ని రాశుల వారు అదృష్టాన్ని పొందబోతున్నారు .మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

వృశ్చిక రాశి
పరివర్తిని ఏకాదశి వృశ్చిక రాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి వారికి భారీగా ధన లాభాలు కలుగుతాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరిక తీరుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు దొరుకుతాయి. ఎప్పటినుంచో వసూలు కానీ మొండి బాకీలు వసూలు అవుతాయి. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. మీ వల్ల సన్నిహితులు, మిత్రులకి లాభాలు వస్తాయి.
మీనరాశి
పరివర్తిని ఏకాదశి నుండి మీన రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో మీన రాశి వారు రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారు. రాజకీయాలలో కీలక పదవులను పొందుతారు. కోర్టు కేసులలో విజయాలను సాధిస్తారు. సంతానం నుండి శుభవార్తలు వింటారు. సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు.
కన్యారాశి
పరివర్తిని ఏకాదశి నుండి కన్యారాశి జాతకులకు శుభ ఫలితాలు వస్తాయి. ఈ రాశుల వారికి ఈ సమయంలో లాటరీలు తగిలే అవకాశం ఉంది. భూముల అమ్మకాల విషయంలో లాభాలను గడిస్తారు. కోరుకున్న యువతితో పెళ్లి కుదురుతుంది . భార్య తరఫున ఉన్న ఆస్తులు మీ సొంతమవుతాయి. ఆన్లైన్లో పెట్టే ఇన్వెస్ట్మెంట్ లు మీకు రెట్టింపు లాభాలను ఇస్తాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications