7 ఏళ్లు... ఈ రాశులు మట్టి పట్టుకున్నా బంగారమే
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచరిస్తుంటాయి. ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాశులకు సానుకూల పరిణామాలు ఎదురైతే మరికొన్ని రాశులకు ప్రతికూల పరిణామాలు ఎదురవుతుంటాయి. ఇదే సమయంలో కొన్ని అద్భుతమైన యోగాలు కూడా ఏర్పడుతుంటాయి. లగ్జరీ జీవితానికి మారుపేరైన కుజుడు విలాసవంతమైన జీవితానికి, శక్తికి ప్రతీక. కుజుడు అన్ని గ్రహాల్లో అత్యంత శక్తివంతమైన గ్రహంగా పేరు తెచ్చుకుంది. కుజ మహాదశ కారణంగా కొన్ని రాశులకు అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం.
సింహ రాశి
ఈ రాశివారు జీవితంలో కొన్ని క్లిష్టమైన పరిస్థితులను, సందర్భాలను ఎదుర్కొంటారు. అయితే కాస్తంత ఆవేశాన్ని తగ్గించుకుంటే చాలా మంచిది. ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. చేసే పనుల్లో ఎవరూ వీరిని ఓడించలేరు. ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ అత్యంత జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి.

కర్కాటక రాశి
జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. కుజుడి అనుగ్రహం వల్ల ఆర్థికంగా బలపడతారు. జీవితంలో ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది. సుఖసంతోషాలన్నీ కలిగి కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు.
మేష రాశి
కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న వివాదాలన్నీ సమసిపోయి అందరిమధ్య సఖ్యత మెలుగుతుంది. జీవితంలో అన్ని పనులు కలిసిరావడంతోపాటు ప్రతిదీ అత్యంత శుభప్రదమవుతుంటుంది. ఆర్థిక సంక్షోభం నుంచి ఈ సమయంలో బయటపడతారు. కుజుడి అనుగ్రహం వల్ల అన్ని పనులను తిరుగులేనివిధంగా పూర్తిచేస్తారు. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది.
వృశ్చిక రాశి
చిన్న చిన్న ఆరోగ్య సమస్యలుంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఎటువంటి కష్టాలు దరిచేరవు. ప్రధానంగా కుజుడి అనుగ్రహం ఉండటంవల్ల ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి తీసుకుంటే అన్నీ కలిసివస్తాయి.
మీనరాశి
ఈ రాశివారు మొండివారిగా ఉంటారు. ఆర్థికంగా పరిస్థితి కుదుటపడుతుంది. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో విజయం సాధిస్తారు.
ధనుస్సు
జీవితంలో పైకి వస్తారు. కొన్ని ఇబ్బందులున్నప్పటికీ అధిగమిస్తారు. కుజుడి అనుగ్రహం వల్ల కొత్త ఇంటిని, స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. పనుల్లో విజయం సాధిస్తారు.












Click it and Unblock the Notifications