ఆగస్ట్ లో ఈ రాశులవారు ఆర్ధికంగా నష్టపోయే ప్రమాదం.. జాగ్రత్త!
జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం గుర్తింపు ఉంటుంది. గ్రహాలకు అధిపతిగా భావించే సూర్యుడికి కూడా జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ప్రస్తుతం సూర్యుడు కర్కాటక రాశిలో ఉన్నాడు. ఆగస్టు 17వ తేదీన సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సూర్యుడు ప్రతినెలా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తాడు.
సూర్య సంచారంతో ఇబ్బందులను ఎదుర్కొనే రాశులు
సూర్య సంచారం అన్ని రాశుల వారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తాయి. సూర్య సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితంలో సంతోషం కనిపిస్తుంటే, మరికొన్ని రాశుల వారు కష్టాలను అనుభవించే అవకాశం ఉంది. మరి సూర్య సంచారంతో ఇబ్బందులను ఎదుర్కొనే ఆ రాశులను గురించి తెలుసుకుందాం.

కన్యారాశి
కన్యా రాశి వారికి సింహరాశిలో సూర్య సంచారం ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో కన్య రాశి జాతకులు చిన్నచిన్న సమస్యలను ఎదుర్కొంటారు. కన్యా రాశి వారు పనులు పూర్తి చేయడానికి కష్టపడవలసి వస్తుంది. వీరి ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. ఖర్చులు పెరుగుతాయి. ప్రేమ జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయి. చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది.
మకర రాశి
మకరరాశి వారికి సూర్య సంచారం సానుకూల ఫలితాలను ఇవ్వదు. ఈ సమయంలో మకర రాశి జాతకులు అన్ని విధాల ఇబ్బందులు పడతారు. మకర రాశి వారి వైవాహిక జీవితంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పనిచేసే చోట ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఆందోళన పెరుగుతుంది. ఉద్యోగం చేసే వారు ఎవరితోనో ఆర్గ్యుమెంట్స్ చేయకుండా ఉంటే మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
కుంభరాశి
సూర్య సంచారం కుంభ రాశి జాతకులకు కాస్త ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. ఈ సమయంలో కుంభరాశి జాతకులు కెరీర్ కు సంబంధించి నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోవాలి. మీ ప్రత్యర్ధులు మీకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. ఈ సమయంలో ఇన్వెస్ట్మెంట్స్ మంచిది కాదు. విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ వహించాలి. ఆర్థిక పరంగా నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.












Click it and Unblock the Notifications