ఈ రాశులవారు చంద్రగ్రహణం చూడొద్దు..చూస్తే నరకమే.. జాగ్రత్త!
సెప్టెంబర్ 7వ తేదీన భారతదేశంతో సహా పలు దేశాలలో సంపూర్ణ చంద్రగ్రహణం కనిపించబోతుంది. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం రాత్రి 9.57 నిమిషాలకు ప్రారంభమై తెల్లవారుజామున 1. 27 నిమిషాల వరకు మూడున్నర గంటల పాటు కొనసాగుతుంది. ఈ గ్రహణం సమయంలో ఆకాశంలో ఎర్రటి చంద్రుడు కనిపిస్తాడు. దీనిని బ్లడ్ మూన్ అని అంటారు.
భారత్ లో సంపూర్ణ చంద్రగ్రహణం ప్రభావం
ఈ సంపూర్ణ చంద్రగ్రహణం సాధారణ చంద్రగ్రహణం కంటే మరింత ప్రభావవంతంగా ఉంటుంది. దేశంలో ఈ సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని చూడవచ్చు. సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా దీని సూతక కాలం మధ్యాహ్నం 12 గంటల 58 నిమిషాలకు మొదలవుతుంది. కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం ప్రభావం ప్రజల దైనందిన జీవితాలపై ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

ఈ రాశులవారు చంద్రగ్రహణం చూడొద్దు
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025 సంవత్సరంలో ఏర్పడే ఈ చివరి చంద్రగ్రహణం కొన్ని రాశుల వారికి అనుకూలంగాను మరికొన్ని రాశుల వారికి అశుభకరంగా ఉంటుంది. ఇక చంద్రగ్రహణం కారణంగా అశుభకరమైన ఫలితాలు పొందే రాశుల గురించి తెలుసుకుందాం. ఈ సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని సింహరాశి, తులారాశి, వృశ్చిక రాశి, మకర రాశి, కుంభరాశి లకు చెందిన వారు చూడకూడదు.
చంద్ర గ్రహణాన్ని చూస్తే నరకం చూడాల్సిందే
ముఖ్యంగా కుంభరాశిలో గ్రహణం సంభవిస్తుంది, కాబట్టి ఇది వీరికి చాలా అశుభకరమైనదిగా చెబుతున్నారు. ఒకవేళ పొరపాటున చూస్తే చాలా చెడు ఫలితాలను ఎదుర్కోవలసి వస్తుందని, జీవితంలో నరకాన్ని చూడవలసి వస్తుందని హెచ్చరిస్తున్నారు. పొరపాటున చంద్ర గ్రహణాన్ని వారు చూసినట్లయితే దుష్ప్రభావాలను నివారించడానికి కొన్ని చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఈ పరిహారాలతో చంద్ర గ్రహణ దోష విముక్తి
మనం తర్వాత మోక్ష స్నానం చేసి కంచు పాత్రలో బియ్యం, వెండి, బంగారం, ఇనుము, లేదా రాగి పామును దానం చేయాలని పండితులు చెబుతున్నారు. ఈ సంపూర్ణ చంద్రగ్రహణం కొంత అస్థిరతను, గందరగోళాన్ని, అసంతృప్తిని సృష్టించే అవకాశం ఉందని గ్రహణ సమయంలో సూతక కాలంలో ఆహారం తినకూడదని చెబుతున్నారు.
గ్రహణ సూతక కాలంలో ఇలా చేస్తే మంచిది
పిల్లలు, వృద్ధులు, రోగులు, గర్భిణీ స్త్రీలకు ఇందులో మినహాయింపు ఉంటుందని, మనం తీసుకునే ఆహారంలో, నీరు, పాలు వంటి వాటిలో తులసి ఆకులను వేయడం ద్వారా గ్రహణ దుష్ప్రభావాలను తప్పించుకోవచ్చని చెబుతున్నారు. సూతక సమయంలో ఇంట్లోని పూజ గది తలుపులను మూసి ఉంచాలని, దేవుడి విగ్రహాలను తాకకూడదని చెబుతున్నారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications