మార్చి నెలలో ఈ రాశులవారు అత్యంత ఐశ్వర్యవంతులు
గ్రహాలు నిర్దేశిత సమయం తర్వాత ఉదయించడం లేదా అస్తమించడం లేదంటే కదలికలను మార్చుకోవడం చేస్తుంటాయి. ఇతర గ్రహాలతో శుభ యోగాలతోపాటు అశుభ యోగాలను సృష్టిస్తుంటాయి. ఈనెలలో కూడా అలాంటి మార్పులు చోటుచేసుకుంటాయి.
ఈనెల నాలుగున కేతువు, ఏడోతేదీన బుధుడు, మార్చి 14న సూర్యుడు, మార్చి 25న అంగారకుడు తమ రాశులను మార్చుకుంటాయి. 18వ తేదీన శనిదేవుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ మార్పులన్నీ కొన్ని రాశులవారికి విశేష ప్రయోజనాలను కలిగించనున్నాయి.

కన్యారాశి: ఈ రావివారి ఆర్థిక పరిస్థితి గతం కంటే బలపడుతుంది. వ్యక్తిత్వంతో నలుగురిని ఆకట్టుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అనుకున్న లక్ష్యాన్ని సాధించడంతోపాటు లగ్జరీ జీవితాన్ని గడుపుతారు.
వృశ్చిక రాశి: ఈనెలలో వృశ్చిక రాశివారు వాహనాన్ని లేదంటే ఇంటిని కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతుంది. చేసే పనికి ప్రశంసలు లభించడంతోపాటు ఉద్యోగస్తులకు ప్రమోషన్ తోపాటు ఇంక్రిమెంట్ లభిస్తుంది.
వృషభ రాశి: ఈ రాశివారి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ఉద్యోగానికి సంబంధించి మంచి వార్తను వింటారు. ఆర్థికంగా లాభం కలుగుతుంది. వివాహం కానివారికి వివాహం కుదురుతుంది.
కర్కాటకరాశి: విదేశాలకు వెళ్లాలనుకునేవారి కోరిక నెరవేరుతుంది. ప్రేమ జీవితం విజయవంతమవుతుంది. తక్కువ సమయంలోనే ధనవంతులుగా మారతారు. వివాహం కుదురుతుంది.
సింహరాశి: ఈ రాశివారికి భారీ లాభాలున్నాయి. ప్రతి పనిలో విజయం సాధించడంతోపాటు భాగస్వామిగా చేసే వ్యాపారాల్లో విజయాలు సాధిస్తారు. ఉద్యోగ నిమిత్తం లేదంటే వ్యాపార నిమిత్తం లాభసాటితో కూడిన దూర ప్రయాణాలు చేస్తారు.












Click it and Unblock the Notifications