జులైలో గ్రహాల కదలిక... ఈ రాశులకు మహర్దశ
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జులై నెల ప్రత్యేకమైంది. ఈ నెలలో 5 గ్రహాల గమనంలో మార్పు రానుంది. జులై ఒకటోతేదీన కుజుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. జులై 7న శుక్రుడు కూడా సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. అలాగే జులై 8న బుధుడు కర్కాటకరాశిలోకి ప్రవేశిస్తాడు. జులై 17న సూర్యుడు కర్కాటకరాశిలోకి ఎంటరవుతాడు. దీనివల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. అదే నెల 23వ తేదీన శుక్రుడు సింహరాశిలో తిరోగమనం చేస్తాడు. జులై చివరి వారంలో బుధుడు కర్కాటకం నుంచి సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ గ్రహాల సంచారాల ప్రభావం మొత్తం 12 రాశులపై ఉంటుంది. అయితే మూడు రాశిచక్రాలవారికి మాత్రం ఎంతో ప్రయోజనకరకంగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు.
వృషభ రాశి : వృషభ రాశి వారికి అంతా శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి చెందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంది. గతంలో చిక్కుకుపోయిన డబ్బును పొందుతారు. దాని ప్రభావం మీ మాటల్లో కనపడుతుంది. భౌతిక సౌకర్యాలు పెరుగుతాయి. వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయి.

తులా రాశి : తులారాశివారికి అంతా అనుకూలంగా ఉంటుంది. విదేశాలకు వెళ్లే అవకాశాన్ని పొందుతారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వాహనం లేదంటే ఆస్తిని కొనుగోలు చేయవచ్చు లేదంటే విక్రయించడం జరుగుతుంది. గతంలో ప్రారంభమై నిలిచిపోయిన పనులన్నింటినీ పూర్తిచేస్తారు. వ్యాపార ఒప్పందం గతంలో నిలిచిపోయి ఉంటే దాన్ని ఖరారు చేయడానికి ఇది మంచి సమయం.
ధనుస్సు రాశి : వీరి కోరికలన్నీ నెరవేరతాయి. వివిధ మార్గాల నుంచి డబ్బు అందుతుంది. ఆదాయాలను పొదుపు చేసుకుంటారు. ఆనందం, శ్రేయస్సు కూడా పెరుగుతుంది. ఆధ్యాత్మిక భావనలు కలిగి ఆ వాతావరణంతో కనెక్ట్ అవుతారు. లాటరీ, బెట్టింగ్, షేర్ మార్కెట్ వంటివాటిల్లో సొమ్ము పెట్టుబడి పెట్టాలనుకునేవారు నిరభ్యంతరంగా పెట్టవచ్చు. ఉద్యోగస్తులు కోరుకున్న ప్రదేశానికి బదిలీ అవడంతోపాటు ప్రమోషన్ పొందుతారు.












Click it and Unblock the Notifications