కుబేరుడికి ఇష్టమైన ౩చెట్లను ఇంటికి ఈ దిక్కున నాటండి; డబ్బే డబ్బు!!
చాలామంది ఎంత కష్టపడినా డబ్బులు రావడంలేదని తెగ బాధ పడుతూ ఉంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం లేకపోతే జీవితంలో నిరాశ నిస్పృహలు ఎదురవుతాయి. డబ్బులు రావడం లేదని బాధపడేవారు సంపదలకు దేవుడైన కుబేరుడుకి ఇష్టమైన మూడు మొక్కలను ఇంట్లో పెట్టుకుంటే, అది కూడా సరైన దిశలో పెట్టుకుంటే ఆర్థిక వృద్ధి కలుగుతుందని, సంపద నష్టం జరగదని చెబుతున్నారు.
కుబేరుడుకి ఇష్టమైన మూడు చెట్లు
చెట్లు ఇంటి అందాన్ని పెంచడం మాత్రమే కాకుండా ఇంటికి సానుకూల శక్తిని తీసుకువస్తాయి. హిందూమతంలో ప్రతి దేవత ఒక పువ్వు లేదా ఒక చెట్టుతో సంబంధం కలిగి ఉంటుంది. అలా చెట్లను, మొక్కలను ఇంట్లో నాటడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా కుబేరుడుకి ఇష్టమైన మూడు చెట్లు ఉన్నాయి. మూడు చెట్లను ఇంట్లో సరైన దిశలో నాటితే ఇంట్లో ఐశ్వర్యం ఉంటుంది. మరి ఆ చెట్లేమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

పసుపు మొక్క
ఇంట్లో పసుపు మొక్కను నాటితే డబ్బు కష్టాలు తొలగిపోతాయని, కుబేరుడికి ఇష్టమైన మొక్క పసుపు మొక్క అని చెబుతున్నారు .ఇంట్లో పసుపు మొక్క బృహస్పతిని బలపరుస్తుంది అని చెబుతున్నారు. పసుపు మొక్కను ఇంట్లో ఉత్తరం వైపున పెడితే, డబ్బు కష్టాలు తొలగిపోతాయని, ఐశ్వర్యం కలుగుతుందని చెబుతున్నారు.
మందార మొక్క
కుబేరునికి ఇష్టమైన మరొక మొక్క మందార మొక్క. మందార మొక్కను ఉత్తర దిక్కున పెడితే డబ్బులకు ఇబ్బంది తొలగిపోతుందని చెబుతున్నారు. డబ్బు రావడానికి మార్గం సుగమం అవుతుందని మంగళ దోషం తొలగిపోతుందని, ఇంట్లో ఎర్రటి మందార పూల మొక్కలను పెంచుకోవాలని చెబుతున్నారు. అయితే వీటిని ఉత్తరం దిక్కులో మాత్రమే పెట్టాలని చెబుతున్నారు.
క్రాసులా
కుబేరునికి బాగా ఇష్టమైన మరొక మొక్క క్రాసులా. ఇంట్లో ఈ మొక్కను ఉంచితే ఇంటికి సంపద వస్తుందని చెబుతున్నారు, క్రాసులా మొక్కను ఇంటికి నైరుతి లేదా ఉత్తరం వైపు ఉంచితే ఉద్యోగ అవకాశాల పురోగతి ఉంటుందని చెబుతున్నారు. క్రాసులా మొక్క ఇంటికి సానుకూల శక్తిని బాగా ఆకర్షిస్తుందని, దీనిని ఇంట్లో పెట్టుకోవడం శుభప్రదమని, డబ్బును అయస్కాంతంలా ఆకర్షించే గొప్ప శక్తి దీనికి ఉంటుందని చెబుతున్నారు. కనుక కుబేరుడుకి ఇష్టమైన ఈ మూడు మొక్కలను ఇంట్లో పెట్టుకుని డబ్బు ఇబ్బందులు లేకుండా సంతోషంగా జీవించండి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications