మహాశివరాత్రి ఈ రాశులవారికి అత్యంత ప్రత్యేకం.. మహా శక్తివంతం.. మీ మాటే శాసనం!
వేద జ్యోతిషశాస్త్రంలో ఫిబ్రవరి మాసానికి, మహాశివరాత్రి పర్వదినానికి చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంది. ఫిబ్రవరి మాసంలో మహాశివరాత్రి పర్వదినాన అత్యంత శక్తివంతమైన ప్రత్యేక గ్రహయోగాలు ఏర్పడుతున్నాయి. ఈ గ్రహ యోగాల కారణంగా కొన్ని రాశులవారు అదృష్టాన్ని పొందబోతున్నారు. మహాశివరాత్రి రోజున కుంభరాశిలో చతుర్గ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కొన్ని రాశులవారికి విశేషమైన ప్రయోజనాలను చేకూరుస్తుంది. మహాశివరాత్రి పర్వదినాన చతుర్గ్రాహియోగం కారణంగా లబ్ధిని పొందే ఆ రాశులేమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.
మేష రాశి
మహాశివరాత్రి పర్వదినాన మేషరాశి జాతకులకు విశేషమైన లాభాలు రాబోతున్నాయి. ఈ సమయంలో వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఏలినాటి శని ప్రభావం నుండి కొంత విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. ఈ సమయంలో ఏ పని చేసినా విజయవంతం అవుతుంది.

కన్యారాశి
కన్యారాశి జాతకులకు మహాశివరాత్రి నాడు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వారికి ఇది శుభ సమయం. ఉద్యోగులకు జీతాలు పెరిగే అవకాశం ఉంది. కెరీర్ పరంగా కన్యా రాశి వారు గణనీయమైన పురోగతిని సాధిస్తారు. నిరుద్యోగులు ఉద్యోగం గురించి శుభవార్తలు వింటారు.
మకర రాశి
మహాశివరాత్రి పర్వదినాన ఏర్పడే చతుర్గ్రాహి యోగం మకర రాశి వారికి అత్యంత శక్తివంతమైన ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వీరి సమస్యలు తొలగిపోయి, ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఊహించని ధనలాభం వస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. తల్లిదండ్రుల ఆశీస్సులు లభిస్తాయి.
కుంభరాశి
మహాశివరాత్రి పర్వదినాన కుంభరాశి జాతకులు ప్రత్యేకమైన ప్రయోజనాలను పొందుతారు. కుంభ రాశి లోనే శుభాయోగాలు ఏర్పడటం వలన వీరికి అన్ని విధాల లబ్ది జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. చేసే ప్రతి ప్రయత్నంలోనూ విజయాలను సాధిస్తారు. వీరికి శివయ్య ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు. వ్యక్తిగత జాతకాలను బట్టి ఫలితాలు మారవచ్చు.












Click it and Unblock the Notifications