ప్రబోధిని ఏకాదశి రేపే.. ఈ చెట్టును పూజిస్తే ఐశ్వర్యం!!
కార్తీక మాసంలోని శుక్లపక్షంలోని 11వ రోజున ప్రబోధిని ఏకాదశి, దేవ్ ఉథాని ఏకాదశి వస్తుంది. ఇక ప్రబోధిని ఏకాదశి నవంబర్ 23 వ తేదీన వస్తుంది. రేపు రానున్న ప్రబోధిని ఏకాదశికి చాలా విశేషాలు ఉన్నాయి. విష్ణు భగవానుడు నాలుగు నెలల సుదీర్ఘ నిద్ర నుండి రేపు మేల్కొంటాడు.
విష్ణుమూర్తి నిద్రించు నాలుగు నెలల చాతుర్మాస కాలం ముగియటంతో ప్రబోధిని ఏకాదశి నాడు తులసికి వివాహ వేడుకను నిర్వహిస్తారు. శాస్త్రాల ప్రకారం విష్ణువు దేవ శయన ఏకాదశి రోజున నిద్రపోతాడు. మళ్లీ ప్రబోధిని ఏకాదశి నాడు మేల్కొంటాడు. అందుకే ప్రబోధిని ఏకాదశి శ్రీమహావిష్ణువు కోసం అంకితం చేయబడింది.

మత విశ్వాసాల ప్రకారం ప్రబోధిని ఏకాదశి రోజున కొన్ని విషయాలపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అవేమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. ప్రబోధిని ఏకాదశి రోజున తులసిని పూజించటం మాత్రమే కాకుండా, ఒక ప్రత్యేక చెట్టుకు పూజలు చేస్తే ఎంతో మంచి జరుగుతుందని అంటున్నారు. ప్రబోధిని ఏకాదశి నాడు కదంబ వృక్షం, లేదా కడిమి చెట్టును పూజిస్తే మంచిదని అంటున్నారు.
మత విశ్వాసాల ప్రకారం ముఖ్యంగా కదంబ వృక్షం శ్రీకృష్ణుడికి చాలా ప్రీతికరమైనది. శ్రీకృష్ణుని కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న గోపికలు కృష్ణుడు కనిపించకపోవడంతో తల్లడిల్లి పోయారని, కృష్ణుడు వారికి కదంబ వృక్షం కింద వేణువు వాయిస్తూ కనిపించారని చెబుతారు. కృష్ణుడికి కదంబ వృక్షం అంటే ఎంతో ఇష్టమని అందుకే కదంబ వృక్షానికి బొట్టు పెట్టి పూజలు చేస్తే పుణ్య ఫలం లభిస్తుందని చెబుతారు.
ప్రబోధిని ఏకాదశి రోజు కదంబ వృక్షాన్ని పసుపు రాసి బొట్టు పెట్టి , పుష్పాలను సమర్పించి పూజిస్తే మంచి జరుగుతుందని చెప్తారు. ఇలా కదంబ వృక్షాన్ని పూజించడం వల్ల జీవితంలో సుఖశాంతులు, ఐశ్వర్యం లభిస్తాయని చాలామంది ప్రగాఢంగా విశ్వసిస్తారు. అందుకే కార్తీక మాసంలోని ప్రబోధిని ఏకాదశి నాడు కచ్చితంగా కదంబ వృక్షాన్ని పూజించండి. జీవితంలోని కష్టాలు తొలగిపోవడమే కాకుండా, సుఖశాంతులు కలుగుతాయి. సంతోషంగా జీవితం సాగుతుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications