ఈ రాశులకు ఇప్పటికే సిరిసంపదలను రాసిచ్చిన రాహువు!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, వివిధ రాశులలో గ్రహాలు సంయోగం అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. ప్రస్తుతం నవగ్రహాలలో చెడు చేసే గ్రహంగా, క్రూర గ్రహంగా చెప్పుకునే రాహువు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. శని రాశి అయిన కుంభరాశిలో రాహువు సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. శనికి రాహువుకి ఉన్న మైత్రి కారణంగా రాహువు కొన్ని రాశుల వారిని కటాక్షిస్తున్నారు.
కుంభరాశిలో రాహువు సంచారం
మే 18వ తేదీ నుండి కుంభ రాశిలో రాహువు సంచారం కొనసాగుతుంది. ప్రస్తుతం రాహువు వివిధ రాశుల వారికి డబ్బులు మూటలను ఇస్తూ, వారి జీవితాలలో సంతోషాన్ని నింపుతున్నాడు. రాహువు కారణంగా ప్రస్తుతం లబ్ధిని పొందుతున్న రాశుల వారు ఎవరో ప్రస్తుతం తెలుసుకుందాం.

మేషరాశి
మేషరాశి వారికి కుంభరాశిలో రాహువు సంచారం అదృష్టాన్ని ఇస్తుంది. ప్రస్తుతం మేష రాశి వారు రాహువు అనుగ్రహం కారణంగా ఆర్థిక ప్రయోజనాలను పొందుతున్నారు. వీరి ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ప్రస్తుతం వీరికి మంచి రోజులు కొనసాగుతున్నాయి. ఖర్చులు బాగా తగ్గుతున్నాయి. మేష రాశి వారి కుటుంబం సంతోషంగా ఉంటుంది.
మిధున రాశి
రాహువు కారణంగా మిధున రాశి జాతకులు అదృష్టాన్ని పొందుతున్నారు. నూతన వాహనాలను ఆస్తులను కొనుగోలు చేస్తున్నారు. ఈ సమయం వీరికి శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతులు వస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో లాభాలు గడిస్తారు. ఎప్పటినుంచో పూర్తికాని పనులు పూర్తవుతాయి. అన్ని విధాల ఇది వీరికి కలిసి వస్తుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి జాతకులకు రాహువు సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది. మీరు కష్టానికి తగిన ఫలితాన్ని ప్రస్తుతం చూస్తున్నారు. ఉద్యోగాలు చేసేవారు పురోగతిని సాధిస్తున్నారు. కొత్త పనులు మొదలుపెట్టి పెట్టుబడులు పెడితే ఈ సమయం వీరికి సక్సెస్ ను ఇస్తుంది. కుటుంబ సభ్యులు మనస్పర్ధలు పక్కనపెట్టి సంతోషంగా గడిపే సమయం.
ధనుస్సు రాశి
రాహువు సంచారం ధనుస్సు రాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వీరు వర్తక వ్యాపారాలు చేస్తే మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగాలు చేసేవారు గుర్తింపును పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం ఏర్పడి సంతోషంగా ఉంటారు. ధనుస్సు రాశి జాతకులకు ఇది అదృష్ట సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications