ఈ రాశులవారిపై రాహువు ప్రేమ.. కుబేరులు అవ్వటం పక్కా అంటూ ధీమా!
నవగ్రహాలలో ప్రతి గ్రహానికి దేనికదే ప్రాధాన్యత ఉంటుంది. నవగ్రహాలలో రాహువు, కేతువులను నీడ గ్రహాలుగా కీడు గ్రహాలుగా చెబుతుంటారు. ఈ రెండు గ్రహాల సంచారం ప్రతి రాశి వారి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. రాహువు కేతువు రెండు తిరోగమనంలో సంచరిస్తారు. రాహు, కేతువుల తిరోగమన సంచారం నిదానంగా సాగుతుంది.
రాహువుకు ఇష్టమైన రాశులు
రాహువు కేతువులు చెడు చేసే గ్రహాలే అయినప్పటికీ కొన్ని రాశుల వారి పట్ల ప్రత్యేకమైన ప్రేమను కనబరుస్తాయి. రాహు గ్రహానికి కొన్ని రాశులలో జన్మించిన వారంటే చాలా ఇష్టమని చెబుతారు. విశేషమైన ప్రయోజనాలను చేకూరుస్తారని చెబుతారు. రాహువు కు అత్యంత ప్రీతిపాత్రమైన ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

మిధునరాశి
రాహువుకు అత్యంత ఇష్టమైన రాశులలో మిధునరాశి ఒకటి . మిధునరాశిలో రాహువు ఉచ్చస్థితిలో ఉంటాడు. ఇది బలమైన మేధో ఉత్సుకతను, కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుస్తుంది. మిధునరాశి వారిపైన రాహువు అనుగ్రహాన్ని చూపిస్తాడు. వారి జీవితంలో అద్భుతమైన ఫలితాలను రాహువు ఇస్తాడు. మిధునరాశి జాతకులు దీర్ఘకాలిక సమస్యల నుండి రాహువు కారణంగా పరిష్కారం పొందుతారు. అనారోగ్య సమస్యలు కూడా రాహువు తొలగిస్తాడు. కోరుకున్న కోరికలు మిధునరాశి వారికి నెరవేరడానికి రాహువు కారణం.
కన్యా రాశి
రాహువుకు ఎంతో ఇష్టమైన రాశులలో కన్యా రాశి ఒకటి. కన్యా రాశి వారికి రాహువు కారణంగా విపరీతమైన ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. వీరు రాహువు ఆశీస్సులతో జీవితాంతం సంతోషంగా ఉంటారు. జీవితంలో వీరి ఆనందం రెట్టింపు అవుతుంది. ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోయి ఈ సమయం కన్యా రాశి వారు మంచి ఫలితాలను పొందుతారు .మానసిక ప్రశాంతత పెరుగుతుంది.
కుంభరాశి
కుంభరాశి వారి పైన కూడా రాహువు సానుకూల ఫలితాలను కలిగిస్తాడు. కుంభ రాశి వారిలో రాహువు ప్రగతిశీల ఆలోచనలు, మానవతా ప్రయత్నాలను కలిగిస్తాడు. సామాజిక మార్పు కోసం పని చేయాలన్న కోరిక రాహువు కారణంగా కలుగుతుంది. రాహువు కుంభరాశి జాతకులను తన ఆశీర్వాదంతో బలోపేతం చేస్తాడు. ఆర్థిక ప్రయోజనాలను కలిగిస్తాడు. మొత్తంగా రాహువు కారణంగా కుంభరాశి వారు అదృష్టవంతులు అవుతున్నారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications